TDP membership : అక్టోబరు 26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు.. రూ.100తో రూ.5 లక్షల బీమా

TDP membership
TDP membership : టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. పార్టీని బలోపేతం చేయడం, నామినేటెడ్ పదవుల భర్తీపై ఉండవల్లిలోని తన నివాసంలో నేతలతో చర్చించారు. శనివారం (అక్టోబరు 26) నుంచి ప్రారంభమయ్యే టీడీపీ సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో చేపట్టేలా టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. రూ.100 సభ్యత్వంతో టీడీపీ కార్యకర్తలకు రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, వారి కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం సాయం అందించనున్నారు.
అలాగే, రెండో దఫా నామినేటెడ్ పదవుల భర్తీపై ఉదయం నుంచి మూడు గంటల పాటు నేతలతో సీఎం చర్చించారు. సాధ్యమైనంత త్వరగా రెండో లిస్ట్ విడుదల చేసేలా కసరత్తు చేస్తున్నారు. మొదటి దశలో ఇచ్చిన 21 నామినేటెడ్ పదవులకు రెట్టింపు సంఖ్యలో రెండో జాబితా ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.