Gorantla Butchaiah : జూన్ 11న టీడీపీ ఎల్పీ సమావేశం.. 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం

Gorantla Butchaiah Chowdary
Gorantla Butchaiah : ఈనెల 11వ తేదీన టీడీపీ ఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నట్లు టీడీపీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతుందని, అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కూడిన నివేదికను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందజేస్తామని వెల్లడించారు.
ఈనెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలు పార్టీల నేతలు హాజరుకానున్నారని తెలిపారు. చంద్రబాబు, ప్రధాని ప్రమాణ స్వీకారంతో పాటు ఒడిశాలో జరిగే బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారని బుచ్చయ్య చౌదరి వివరించారు. ఓటమి చూశాక కూడా కూడా జగన్ తీరు మారలేదని విమర్శించారు. అసహనంతో టీడీపీ శ్రేణులపై దాడుల్ని ప్రేరేపిస్తూ.. తామేదో దాడులు చేస్తున్నట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.