TDP Kutami Victory : కూటమి విజయ మంత్రం ఓట్ల బదిలీ
TDP Kutami Victory : తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడికి రాజకీయాలకు పెట్టింది పేరు. అతి తక్కువ కాలంలోనే కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టి జాతీయ పార్టీలకు కూడా సలహాలు, సూచనలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. సిద్ధాంతం ప్రకారం నాయకుడు. తాను నమ్మిన సిద్ధాంతం ప్రకారం తన నీడను తానే నమ్మని నాయకుడు. అంతే కాదు క్రమశిక్షణ అంటూ క్యాడర్ ను తన గుప్పిట్లో పెట్టుకోవడం దిట్ట.
రాజకీయ ఎత్తుగడలు వేస్తూ ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో తనకు తానే సాటి. అటువంటి చంద్రబాబు నాయుడు బీజేపీ, జనసేన తో పొత్తు కుదుర్చుకొని వైసీపీ ని తాజా ఎన్నికల్లో బొంద పెట్టి తన పంథం నెగ్గించుకున్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేసి ఏపీలో తానా సత్తా ఏమిటో చూపించారు. పొత్తులతో ఓట్లను సులభంగా తన ఖాతాలో వేసుకునే విధంగా ప్రణాళికలు రచించి సఫలం అయ్యారు.
ఓట్లు బదిలీ జరిగితేనే విజయాలు సాధ్యమనే విషయాన్ని కూటమి ముందే పసిగట్టింది. కాషాయం నేతలు 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ పడ్డారు. పవన్ కళ్యాణ్ తన పార్టీ నుంచి 2 పార్లమెంట్, 21 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను బరిలో దించారు. తెలుగు దేశం అదినేత 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో తన అభ్యర్థులను నిలిపారు.
ప్రచారాన్ని మూడు పార్టీల నేతలు ప్రశాంతంగా నిర్వహించారు. ఎక్కడ కూడా తేడా కనబడనీయలేదు. ప్రజలకు ఎలాంటి అనుమానాలకు తావివ్వలేదు. కూటమి లో తేడాలు ఉన్నాయని, వారిలో ఐక్యత లేదంటూ వైసీపీ అభ్యర్థులు కూడా ప్రచారం చేశారు. ఆ ప్రచారం కూడా ఎక్కడ నిలబడలేదు. జనసేన అధినేత పోటీచేస్తున్న పిఠాపురం లో కూడా పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియా లో ప్రచారం చేశారు కొందరు వైసీపీ నేతలు. అది కూడా వారినే తిరిగి కొట్టింది.
కూటమికి చెందిన నాయకులకు బూతు స్థాయి నుంచే కొనుగోలు చేయాలని వైసీపీ ప్రయత్నాలు చేపట్టింది. అదికూడా బెడిసి కొట్టింది. చివరకు బెదిరింపులు, విధ్వంసాలు సృష్టించి ఓట్లు వేయించుకోవాలని వైసీపీ బెదిరింపు ధోరణికి దిగింది. అయినా వాలు ఆశించిన ఫలితం ఎక్కడ కూడా కనబడలేదు. ఎట్టకేలకు కూటమి వైపే ప్రజలు బ్రహ్మ రథం పట్టారు.