JAISW News Telugu

TDP-Janasena-BJP Alliance : సీట్ల సర్దుబాటు కొలిక్కి.. ఎవరెన్ని సీట్లలో, ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారంటే..

TDP-Janasena-BJP Alliance

TDP-Janasena-BJP Alliance

TDP-Janasena-BJP Alliance : ఎట్టకేలకు టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. ఏ స్థానంలో ఎవరు పోటీ చేయాలనే దానిపై మూడు పార్టీల నేతలు సోమవారం ఎనిమిది గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చర్చలు జరిగాయి.

కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు పాండా, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, టీడీపీ అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ చర్చల నేపథ్యంలో సీట్ల షేరింగ్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

తొలుత బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ, 8 ఎంపీ సీట్లు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. అయితే సుదీర్ఘ చర్చల అనంతరం స్వల్ప మార్పులు జరిగాయి. గతంలో జనసేనకు 24 సీట్లు కేటాయించారు. అయితే తమకు కేటాయించిన 24 స్థానాల్లో మూడు సీట్లను బీజేపీకి కేటాయించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లలో పోటీ చేయబోతోంది. మరో వైపు టీడీపీ కూడా ఒక స్థానాన్ని బీజేపీకి కేటాయించింది.

బీజేపీ మొత్తంగా 10 అసెంబ్లీ స్థానాలు, ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక టీడీపీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతోంది. తిరుపతి, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. కాకినాడ, మచిలీపట్టణం ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో ప్రకటించారు.

మొత్తంగా ఈ చర్చలు టీడీపీ, బీజేపీకే సానుకూలంగా ఉన్నాయి. జనసేన భారీ త్యాగం చేసిందనే చెప్పాలి. ఆ పార్టీ సీట్లలో భారీ కోత పడడం జనసైనికులకు, కాపు సామాజిక వర్గ నేతలకు మింగుడు పడడం లేదు. కేవలం 21 అసెంబ్లీ, 2 లోక్ సభ సీట్లలోనే పోటీ చేయడం వల్ల భవిష్యత్ లో పెద్దగా ఒరిగేది ఏమీ లేదని నిరాశ చెందుతున్నారు.

Exit mobile version