Bhashyam Praveen : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు టిడిపి ప్రభుత్వం అండగా ఉంటుంది
– తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్
Bhashyam Praveen : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ అన్నారు. పెదకూరపాడు మండలం, పాటిబండ్ల గ్రామంలో శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని, రాష్ట్రంలో ఏ ఒక్కరికి భద్రత లేదని అన్నారు. ఎస్సీలకు రావలసిన సంక్షేమ పథకాలను నిలిపివేసిన ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుందని ప్రశ్నించారు.