JAISW News Telugu

Bhashyam Praveen : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు టిడిపి ప్రభుత్వం అండగా ఉంటుంది

–  తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్

Bhashyam Praveen

Bhashyam Praveen

Bhashyam Praveen : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ అన్నారు. పెదకూరపాడు మండలం, పాటిబండ్ల గ్రామంలో శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని, రాష్ట్రంలో ఏ ఒక్కరికి భద్రత లేదని అన్నారు. ఎస్సీలకు రావలసిన సంక్షేమ పథకాలను నిలిపివేసిన ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుందని ప్రశ్నించారు.

 కరోనా సమయంలో మాస్క్ అడిగిన పాపానికి డా. సుధాకర్ ను అవమానించి, పోలీసులతో ఇబ్బందులకు గురిచేసి అతని ప్రాణం తీసింది జగన్ ప్రభుత్వం అని అన్నారు. కోడి కత్తి అనే చిన్న డ్రామా క్రియేట్ చేసి శ్రీను ని ఐదు సంవత్సరాలుగా జైల్లో పెట్టి ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఒక పేద దళిత డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన అరాచకమైన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డిది అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకమైన పాలనను దృష్టిలో ఉంచుకొని ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని ఓటు వేయాలని అన్నారు.
ఈ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Exit mobile version