Vidadala Rajani : విడదల రజనీపై టీడీపీ ఈక్వెషన్స్ వేరే లెవల్!

Vidadala Rajani

Galla Madhavi VS Vidadala Rajani

Vidadala Rajani : వైసీపీ మంత్రి విడదల రజనీపై టీడీపీ నుంచి షాకింగ్ అభ్యర్థిని రంగంలోకి దించబోతున్నారు. ప్రస్తుతం చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న రజనీపై అక్కడ తీవ్ర వ్యతిరేకత ఉందన్న అంచనాల నేపథ్యంలో ఆమెను ఎలాగైనా అసెంబ్లీలో ఉండేలా చూడాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆమెను గుంటూరు వెస్ట్ ఇన్ చార్జిగా నియమించగా.. ఆమె ప్రచారాన్ని స్పీడప్ చేసేశారు. వెస్ట్ లో రజనీని ఓడించాలంటే ఎవరిని రంగంలోకి దింపాలా? అని టీడీపీ అధిష్ఠానం నెల రోజులుగా సమాలోచనలు చేస్తున్నది.

చాలా మంది ఆశావహుల పేర్లు, చాలా ఈక్వేషన్లు పరిశీలనకు వచ్చాయి. కాపు, కమ్మ, వైశ్య, బీసీలు..ఇలా ఎవరిని రంగంలోకి దింపితే రజనీకి బలమైన ప్రత్యర్థి అవుతారో చాలా చర్చలు జరిగాయి. చివరకు రజనీపై సేమ్ టు సేమ్ అస్త్రం వాడుతున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. రజనీ బీసీ మహిళ కాగా.. చంద్రబాబు సైతం బీసీ మహిళనే ఆమెపై పోటీకి దింపబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు గల్లా మాధవి.

గల్లా మాధవి బీసీల్లోని రజక సామాజిక వర్గానికి చెందిన వారు. గుంటూరు వికాస్ హాస్పిటల్స్  డైరెక్టర్ గా ఉన్న మాధవి గతం నుంచి సేవా కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ ఏకంగా గుంటూరు వెస్ట్ లో విడదల రజనీ, తాడికొండలో మాజీ హోంమంత్రి  సుచరిత, గుంటూరు తూర్పులో షేక్ నూరి ఫాతిమాతో పాటు రేపోమాపో మంగళగిరి నుంచి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను రంగంలోకి దించబోతోంది.

ఇలా వైసీపీ నుంచి ఏకంగా నలుగురు మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వగా.. టీడీపీ నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం మీద ఒక్క మహిళ కూడా లేరు. అటు ప్రకాశం జిల్లాలోనూ అదే పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే గల్లా మాధవిని రజనీపై పోటీకి దింపితే మహిళా కోటాతో పాటు బీసీ కోటాలో బలమైన ఈక్వేషన్ అవుతుందని బాబు భావిస్తున్నారు. మాధవి టీడీపీ క్యాండిడేట్ గా ఫిక్స్ అయితే గుంటూరు వెస్ట్ లో ఇద్దరు బీసీ మహిళల పోరు హోరాహోరీగా ఉండడం పక్కాగా కనిపిస్తోంది.

TAGS