BIG TV Survey : టీడీపీ కూటమిదే హవా..తాజా సర్వే సంచలనం
BIG TV Survey : ఏపీలో ఎన్నికలకు మరో 6 రోజుల సమయమే ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారంలో బిజీగా మారిపోయాయి. ప్రచారం తర్వాత పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టి సారించనున్నాయి. కూటమి ఏర్పడముందుకు వైసీపీలో అధికారంలోకి వస్తామన్న ధీమా కన్పించేది. కానీ కూటమి అధినేత ప్రచారం, జగన్ పాలనలో జరిగిన అక్రమాలు, అన్యాయాలపై ప్రజల్లో అవగాహన రావడంతో ఆ పార్టీలో నైరాశ్యం కనపడుతోంది.
కూటమి తరపున చంద్రబాబు, పవన్ ఉధృతంగా ప్రచారం సాగిస్తుండగా జాతీయ నేతలు మోదీ, అమిత్ షా కూడా భారీ బహిరంగ సభల్లో పాల్గొంటూ కూటమి శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు. ఈక్రమంలో టీడీపీ కూటమి తాజాగా ఓ సర్వే మరింత బూస్ట్ ను అందించింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కూటమిదే ఘన విజయమని తేల్చింది. బిగ్ టీవీ తన ప్రామాణిక సర్వే ద్వారా కూటమిదే ఏపీ అని పేర్కొంది. గతంలో బిగ్ టీవీ కర్నాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పింది. అన్నట్టుగానే అక్కడ ఫలితాలు అదే రకంగా వచ్చాయి. తాజాగా ఏపీలో టీడీపీ కూటమినే విజయం వరిస్తుందని చెప్పింది.
బిగ్ టీవీ సర్వే ఫలితాలు :
టీడీపీ కూటమి : 116
వైసీపీ : 59
టీడీపీ కూటమిలో..
టీడీపీ :96
జనసేన : 16
బీజేపీ : 4
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూటమి 116 స్థానాలు గెలుచుకుని అధికారం చేపట్టబోతోందని సర్వే చెప్పింది. వైసీపీకి 59 స్థానాలకే పరిమితం అవుతుందని పేర్కొంది. కూటమి సాధించే 116 స్థానాల్లో టీడీపీ 96 స్థానాలు సాధిస్తుందని చెప్పింది. ఇందులో 69 సీట్లను ఈజీగా గెలుచుకుంటుందని 27 సీట్లలో టఫ్ ఫైట్ తో కైవసం చేసుకుంటుందని పేర్కొంది. ఇక జనసేన 8 సీట్లను ఈజీగా మరో 8 సీట్లలో టఫ్ ఫైట్ ద్వారా, బీజేపీ 3 సీట్లను ఈజీగా మరో 1 సీటును టఫ్ ఫైట్ ద్వారా గెలుచుకోబోతుందని తేల్చింది. ఇక వైసీపీ 39 సీట్లను ఈజీగా, 20 సీట్లను టఫ్ ఫైట్ ద్వారా కైవసం చేసుకుంటుందని చెప్పింది.
కాగా, ఎన్నికలు మరో 6 రోజులు ముందుగా ఈ సర్వే రావడంతో తాజా పరిస్థితులను అంచనా కట్టిందని చెప్పవచ్చు. క్షేత్రస్థాయిలో వచ్చిన ఫలితం కావడంతో టీడీపీ కూటమిలో జోష్ నెలకొంది. ఇది ఓరకంగా టీడీపీకి ఇది బూస్ట్ ఇచ్చినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు.