Hollywood : హాలీవుడ్ ను మించిపోయిన టాక్సిస్ సెటప్.. యష్ మరో భారీ హిట్ కు రెడీ అవుతున్నాడా?
Hollywood : కేజీఎఫ్ తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకున్న హీరో యష్ ఎట్టకేలకు ‘టాక్సిక్’ ఒప్పుకొని ఆశ్చర్యానికి గురి చేశాడు. కమర్షియల్ అనుభవం లేని, స్టార్ డైరెక్టర్ కూడా కాని గీతూ మోహన్ దాస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేశాడు. టాక్సిక్ ను తక్కువ అంచనా వేస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు. అయితే, ఇది అనుకున్నంత ఆషామాషీ కాదని యూనిట్ చెప్తోంది. మెయిన్ హీరోయిన్ గా కియారా నటిస్తుండగా రెండో కథానాయికగా తారా సుతారియాను తీసుకున్నారని టాక్.
1950 నుంచి 1970 మధ్య గోవా కేంద్రంగా జరిగిన డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో టాక్సిక్ ను తెరకెక్కించినట్లు యూనిట్ చెప్తోంది. హ్యూమా ఖురేషి నెగటివ్ రోల్ లో కనిపిస్తుందని, అలాగే.. నయనతార యష్ కి సోదరి పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై చూడని డార్క్ విజువల్స్ ఇందులో ఉంటాయని మేకర్స్ నుంచి లీకులు బయటకు వస్తున్నాయి. దీంతో మూవీపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. యాక్షన్ ఎపీసోడ్స్ ను ఒళ్లు జలదరించే రీతిలో ప్లాన్ చేశారట. 200 రోజులకు షెడ్యూల్ పెట్టుకుని షూటింగ్ చేశారట. గోవాలో కొంత భాగం.. విదేశాల్లో అధిక భాగం చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
సుమారు 200 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న టాక్సిక్ వచ్చే సంవత్సరం ఏప్రిల్ కు విడుదల కానుంది. కేజీఎఫ్ ఇచ్చిన స్టార్ డం వాడుకోకుండా స్క్రిప్ట్ బాగుందనే వచ్చిన యష్ కు ఈ మూవీ సక్సెస్ కావడం చాలా ఇంపార్టెంట్. సెప్టెంబర్ లేదంటే అక్టోబర్ లో కొంత బ్రేక్ ఇచ్చి నితీశ్ తివారి బాలీవుడ్ రామాయణం షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం. రామాయణం మొదటి భాగంలో తనకు ఎక్కువ సీన్లు లేకపోవడంతో వేగంగానే పూర్తవుతుంది. రామాయణంకు యష్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే, టాక్సిక్ టాక్సిక్ రిలీజయ్యాక పూర్తి డేట్లు ‘రామాయణం2’కు ఇవ్వబోతున్నాడు. అయితే టాక్సిక్ సింగిల్ పార్ట్ తో కంప్లీట్ అవుతుందట.