Tata Car Under 6 Lakhs : 6 లక్షల్లోపే టాటా కార్.. సేఫ్టీ, ఫీచర్ లో బెస్ట్.. సేల్స్ లో కూడా ఇవే బెస్ట్ ఒక లుక్కేద్దాం..
Tata Car Under 6 Lakhs. : SUV కార్లకు మార్కెట్లో డిమాండ్ రాను రాను పెరుగుతోంది. ఈ విభాగంలో ఎక్కువగా టాటా పంచ్, మారుతీ సుజుకీ నెక్సాన్, మారుతి బ్రెజ్జాను ఇష్టపడుతున్నారు. ఈ 3 కార్ల మధ్య విక్రయాల్లో తీవ్రంగా పోటీ ఉంటుంది. గత నెలలో టాటా మోటార్స్ మినీ SUV అమ్మకాలలో కొత్త రికార్డు సృష్టించింది.
జనవరి, 2024లో మారుతీ బెలెనో తర్వాత దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా ‘టాటా పంచ్’ నిలిచింది. జనవరిలో 17,978 కార్లను టాటా విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 12,006 కార్లను విక్రయించింది.
ఇటీవల కంపెనీ సన్‌రూఫ్‌తో కూడిన CNG వేరియంట్‌ను రిలీజ్ చేసింది. CNG కారణంగా ఆర్థిక భారం కొంచెంగా తగ్గింది. ఈ 5 సీటర్ SUV 5 స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్‌తో వస్తుంది.
టాటా పంచ్ ధర రూ. 6 లక్షల నుంచి మొదలై రూ. 9.52 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇందులో 366 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. మారుతిలో అత్యధికంగా అమ్ముడవుతున్న బెలెనో, బ్రెజ్జా, డిజైర్ వంటి కార్లతో ఇది పోటీపడుతోంది. పరిమాణంలో కాంపాక్ట్ అయినా, పంచ్‌లో ఐదుగురు కూర్చోవడానికి తగినంత స్థలం ఉంది. 366 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.
ఆటో మొబైల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ కారు దాని ధరను పరిగణనలోకి తీసుకుంటే అత్యుత్తమ హై స్పీడ్, హైవే స్టెబిలిటీ అందిస్తుంది. సస్పెన్షన్ కఠినమైన రోడ్లపై చాలా సౌకర్యవంతంగా వెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది. అధిక వేగంతో అద్భుతమైన స్థిరత్వాన్ని కలిగి ఉంది. కంపెనీ టాటా పంచ్‌లో 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 88 bhp శక్తిని, 115 Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ 5 స్పీడ్ ఆటో మేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. టాటా పంచ్ పెట్రోల్‌లో 20.09 kmpl, CNGలో 26.99 km/kg మైలేజీని అందిస్తుంది.
ఫీచర్ల గురించి మాట్లాడుతూ, పంచ్‌లో 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే, సెమీ డిజిటల్ ఇన్స్టూమెంట్ ప్యానెల్, ఆటో ఎయిర్ కండీషనింగ్, ఆటో మెటిక్ హెడ్లైట్లు, కనెక్ట్ చేసిన కారు టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రతా పరంగా, ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక డీఫాగర్, EBDతో కూడిన ABS, వెనుక పార్కింగ్ సెన్సార్, బ్యాక్ వ్యూ కెమెరా, ISOFIX యాంకర్ వంటివి ఉన్నాయి. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా పంచ్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.