JAISW News Telugu

Target KCR : టార్గెట్ కేసీఆర్‌: మూలాలు మారుస్తున్న రేవంత్!

Target KCR

Target KCR-CM Revanth

Target KCR : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనా పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ మోడ్ లోకి వెళ్లింది. కేవలం రాజకీయ నాయకులపై విమర్శలు చేయడం, వారు విమర్శించిన దానిపై ప్రతి విమర్శ చేయడం మాత్రమే చేసింది. పోలింగ్ ముగిసిన తర్వాత అసలు కథ మొదలుపెట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే, గత ప్రభుత్వం కేసీఆర్ తన పాలనలో ఎంపిక చేసిన‌.. తెలంగాణ త‌ల్లి విగ్రహం నుంచి రాష్ట్ర అధికారిక చిహ్నం వ‌ర‌కు.. ఒక్కొక్కటిగా స‌మూలంగా మార్పులు చేస్తున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవ‌డం రాజ‌కీయంగా మరింత చర్చనీయాంశమైంది. ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం తెలంగాణ త‌ల్లి విగ్రహంలో కొన్ని మార్పులు చేయించింది.

రాష్ట్ర ఆవిర్భావం తొలినాళ్లలో సీఎంగా ఉన్న కేసీఆర్ ముచ్చటపడి మరీ తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండాలో చెప్పారట. దీని కోసం ఆయ‌న పెద్ద అధ్యయ‌న‌మే చేయించారుట. విమర్శలు, ప్రతి విమర్శల ‘మధ్య మా త‌ల్లి మాయిష్టం’ అంటూ.. కౌంట‌ర్లు కూడా ఇచ్చారు కేసీఆర్. తెలంగాణ త‌ల్లి విగ్రహం చూస్తే.. కేసీఆర్ గుర్తుకు వ‌స్తారు. ఇదే.. ఇప్పుడు మార్పున‌కు కారణమవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

దీంతో పాటు రాష్ట్ర అధికార చిహ్నంలోనూ మార్పులకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్. రాష్ట్ర అధికార చిహ్నంలో కేసీఆర్ ఓరుగ‌ల్లు కోటను ఏర్పాటు చేయించారు. ఇది రాజ‌కీయ వంశాల‌కు చిహ్నమని అందుకే దీన్ని తొలగించి దాని ప్లేస్ లో కొత్తది తీసుకువస్తామని చెప్పారు. ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం అధికార చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నారు. దీన్ని జూన్ 2న ఆవిష్కరించనున్నారు. అయితే..  

తెలంగాణ అధికార గీతం విష‌యంలో కేసీఆర్ వెనుక‌బ‌డ్డారు. తను అధికారంలో ఉన్న పదేళ్లలో ఒక గీతం చేయించాలని అనుకున్నా.. ఎప్పుడూ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇక‌, రేవంత్ వ‌చ్చీ రావ‌డంతోనే.. రాష్ట్ర గేయంపై దృష్టి పెట్టారు. ఏపీ సంగీత దర్శకుడు కీర‌వాణితో కంపోజ్ చేయించారు. ఏపీ సంగీత కారుడు ఎందుకు అన్న కూడా రేవంత్ తగ్గలేదు. అందెశ్రీ రాసిన గీతం.. ‘జయ జయహే తెలంగాణ’ రికార్డింగ్ దాదాపు కంపోజ్ కూడా అయిపోయింది. ఈ మూడు ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. తెలంగాణ‌లో కేసీఆర్ చిహ్నాలు కనిపించకుండా రేవంత్ పక్కా ప్రణాళికతో పని చేస్తున్నారని తెలుస్తోంది. 

Exit mobile version