JAISW News Telugu

Chandrababu : ప్రతీ ఇంటికీ ట్యాప్ వాటర్.. ఇదే చంద్రబాబు హామీ..

Chandrababu

Chandrababu

Chandrababu : ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ప్రజల్లో ఆనందం వెళ్లివిరిసింది. గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ పెట్టిన ఎన్నో పతకాలను పక్కకు నెట్టి తను కొత్త కొత్త పథకాలు తెచ్చారు. కానీ అవేవీ ప్రజలకు ఉపయోగపడలేదు. దీంతో దాదాపు ఐదేళ్లు ప్రజలు సతమతం అయ్యారు. ఈ ప్రభుత్వంలో దోచుకునేడే కానీ, దాచుకునుడు లేదని వాపోయారు. ఎన్ని పనులు చేసుకున్నా నెలాఖరుకు రూపాయి మిగలకుండా ఉందని 2024 ఎన్నికల సమయంలో టీడీపీతో మొరపెట్టుకున్నారు. ప్రభుత్వంలోకి ఈ సారి తామే వస్తామని మీ కష్టాలు ఇక ఉండబోవని ఆయన హామీ ఇచ్చారు. ఆయన అన్నట్లుగానే కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా పీఠం అధిరోహించాడు. పాలనను గాడిలో పెట్టేందుకు అహోరాత్రులు కష్టపడుతున్నాడు. ఇందులో భాగంగా ఒక ప్రజావేదికలో ఆయన చెప్పిన మాటల ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

ప్రతీ ఇంటికీ ట్యాప్ ద్వారా నీటిని తీసుకువచ్చే పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకాన్ని యూపీతో పాటు చాలా రాష్ట్రాలు అందిపుచ్చుకున్నాయి. అదేన విధంగా ఏపీ కూడా దీన్ని వినియోగించుకోవాలని అప్పటి సీఎం జగన్ కు చెప్పాం. కానీ ఆయన వినలేదు. సరికదా.. సమీపంలోని బోర్ల నుంచి నీటిని ఇవ్వడం మొదలు పెట్టాడు. దీంతో భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు శుభ్రమైన స్వచ్ఛమైన నీరు మాత్రం ఇవ్వలేకపోయారు. తన ప్రభుత్వం జట్ జీవన్ మిషన్ ను అత్యంత పకడ్భంధీగా ముందుకు తీసుకెళ్తుంది.

సమీపంలోని స్వచ్ఛమైన రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకువచ్చి ఫిల్టర్ చేసి స్వచ్ఛంగా అందజేస్తాం. అయితే ఈ నీరు గంటో, అరగంటో కాదు.. మీరు ట్యాప్ తిప్పినప్పుడల్లా వస్తూనే ఉంటుంది. ఈ పథకాన్ని వేగంగా అమలు చేసేందుకు ఇటీవల పీఎంతో మాట్లాడాం. ఆయన కూడా నిధులు ఇస్తామన్నారు. ఇక పనులు మొదలు పెట్టి ఆడ బిడ్డల గోస తీరుస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ప్రజా వేదిక సాక్షిగా ఈ హామీ ఇవ్వడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Exit mobile version