Tangalan : తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన తాజా మూవీ ‘తంగలాన్’ ఆగస్ట్ 15న ప్రేక్షకుల విడుదలైంది. పీరియాడికల్ యాక్షన్ నేపథ్యంలో దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించాడు. కొన్నేళ్లుగా సక్సెస్ లేని విక్రమ్ కు ఈ సినిమా బూస్ట్ ఇచ్చింది. తొలి షో నుంచే మంచి టాక్ బయటకు వచ్చింది. విక్రమ్ మరో హిట్టు కొట్టాడని ఆడియన్స్ చెబుతున్నారు.
పార్వతి తిరువోతు, మాళవికా మోహనన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకండా దర్శకుడు పా. రంజిత్ ఓ కొత్త ప్రపంచాన్ని తెరపై చూపించాడనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక విక్రమ్ నటన ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. తను చేసే ప్రతి పాత్రను ఎంతో ప్రేమిస్తాడు. తన క్యారెక్టర్ కు తగ్గట్లుగా మేకోవర్ అవుతాడు. ఇక తంగలాన్ లో కూడా అదే చేశాడు. తంగలాన్ పాత్రలో విక్రమ్ ను తప్ప మరెవరిని ఊహించుకోలేమని ఆడియన్స్ అంటున్నారు. విజువల్స్, మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలం. కానీ, కథనం సాగదీసినట్లుగా ఉందని చెబుతున్నారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో నెటిజన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను వెతికే పనిలో పడ్డారు.
రెండు నెలలు ఆగాల్సిందేనా?
తంగలాన్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కలను నెట్‌ఫ్లిక్స్ సొంతం కైవసం చేసుకుంది. తెలుగు, తమిళంతో పాటు మొత్తం ఐదు భాషల్లో కలిపి రూ. 35 కోట్లకు ఈ సినమా ఓటీటీ హక్కులు కొనుగోలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే సినిమా విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని ముందుగానే ఒప్పందం చేసుకున్నారట. ఈ లెక్కన అక్టోబర్ రెండో వారంలో తంగలాన్ ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వినూత్న సినిమాలను థియేటర్లలో చూస్తేనే బాగుంటుందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.