Tandel Glimpses : ‘తండేల్’ గ్లింప్స్.. యధార్థ కథే ఆధారంగానే..
Tandel Glimpses : నాగ చైతన్య చేసిన ‘ధూత’ వెబ్ సిరీస్ బాక్సాఫీస్ హిట్ సాధించింది. ఓటీటీలో ఆయన మంచి పర్ఫార్మెన్స్ కనబర్చినట్లు ఇట్టే తెలుస్తుంది. కానీ వెండితెరపై మాత్రం ఆయనకు మంచి అవకాశాలు రావడం లేదు. ‘థాంక్యూ’తో తన అభిమానులను కూడా అలరించలేకపోయారు నాగ చైతన్య. దీంతో తన తర్వాతి మూవీ తండేల్ ను మరింత ప్రతిష్టాత్మకంగా తీయాలని అనుకున్నాడు. ఈ చిత్రంలో ఆయన మత్స్యకారుడి పాత్రలో నటిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కోసం నాగ చైతన్య అక్కడికి వెళ్లి మత్స్య కారులతో మాట్లాడి కొన్ని రోజులు గడిపారట. అక్కడి మాండలికాన్ని కూడా ఆయన అలవాటు చేసుకున్నారట.
వైజాగ్, శ్రీకాకుళంలోని మత్స్యకారుల గ్రామాలకు వెళ్లి వారి జీవితాలను, యాసను సరిగ్గా అర్థం చేసుకున్నారు. ప్రేమమ్, సవ్యసాచి చిత్రాలను రూపొందించిన చందూ మొండేటి నాగ చైతన్యతో తన మూడో చిత్రం తండేల్ చేస్తున్నారు. కార్తికేయ 2 తర్వాత, ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి సక్సెస్ అవుతానని చందూ మొండేటి ధీమాగా ఉన్నారు.
ఈ మూవీకి సంబంధించి జనవరి 6వ తేదీ ఎసెన్స్ ఆఫ్ తండేల్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. తండేల్ రాజు, నాగ చైతన్య పాత్ర దేశభక్తిని కలిగి ఉంటుంది. అతన్ని పాక్ సైన్యం అరెస్ట్ చేస్తారు. పాక్ నుంచి తప్పించుకొని ఆయన ఎలా బయటకు వచ్చాడు. అనే కథాంశంతో సినిమా సాగుతుంది. యధార్థ ఘటనల ఆధారంగానే ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు చందూ తెలిపారు.
బుజ్జి తల్లి అనే పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. మూవీ బాక్సాఫీస్ సొంతం చేసుకుంటుందని చిత్ర బృందం కాన్ఫిడెంట్‌గా ఉంది. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వీర్ జారా, చెలియా, రోజా, సీతా రామం, మరియన్ మరియు సరబ్జీత్ వంటి ఒకే రకమైన ఇతివృత్తాలతో సినిమాలు ఉన్నప్పటికీ, ఒక్కొక్కటి ప్రత్యేకమని చెప్పవచ్చు.