Neelima Manne Contest For TANA Regional Representative-North : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కోసం ఎన్నికలు నిర్వహిస్తుంది. ఎగ్జిక్యూటివ్ పదవీ కాలం 2025 వరకు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పదవీ కాలం 2027 వరకు ఉన్న నేపత్యంలో రెండింటికీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను 31 అక్టోబర్, 2023న విడుదల చేసింది. వీటితో పాటు ఆఫీస్ బేరర్లను కూడా నియమించనుంది.
నామినేషన్లకు గడువు నవంబర్ 16 (గురువారం)తో ముగిసింది. స్క్రూట్నీకి నవంబర్ 22 (బుధవారం) విత్ డ్రావెల్ కు నవంబర్ 30 (బుధవారం), డిసెంబర్ 3న ఫైనల్ లిస్ట్, బ్యాలెట్ మెయిలింగ్ డిసెంబర్ 15 (శుక్రవారం), చివరగా 14 జనవరి, 2024 (ఆదివారం) ఎన్నికైన కమిటీ సభ్యులకు సర్టిఫికెట్లు అందజేసే కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
అయితే ఈ సారి కమిటీలో TANA నార్త్ రీజియన్ రెప్రెజెంటేటివ్ గా నీలిమా మన్నే పోటీ చేయనుంది. అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది నీలిమ. దాదాపు 10 సంవత్సరాలకు పైగా TANA తో ఆమె జర్నీ కొనసాగుతోంది. వివిధ ఈవెంట్లు, సంస్కృతిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటుంది. 15 సంవత్సరాలకు పైగా డెట్రాయిట్ ఏరియాలోని అనేక సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. దీనితో పాటు ఆమె DTA వడ్లమూడి వెంకటరత్నం అవార్డు అందుకుంది.
2015 నుంచి DTA (డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్)లో వివిధ పదవులు చేపడుతూ వస్తోంది. 2014 నుంచి TANA జీవితకాల సభ్యత్వం తీసుకుంది. వీటితో పాటు శ్రీ వేంకటేశ్వర ఆలయానికి సంబంధించి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ కు ట్రస్టీగా వ్యవహరిస్తుంది. ఈ సారి తనకు అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతోంది.