Tammineni Nagaraju Free Service : ప్రార్థించే పెదవులకన్నా సేవలు చేసే చేతలే మిన్నఅంటారు. సాయం చేసే గుణం అందరికి ఉండదు. మనకున్న దాంట్లో నలుగురికి పంచాలనే సేవా గుణం ఉన్న వారు అరుదుగానే కనిపిస్తారు. ఎంత డబ్బు ఉన్న ఇంకా కావాలనే కాంక్షతోనే ఉంటారు. కానీ ఉన్నదాంట్లో దానం చేయాలనే ఉద్దేశం చాలా మందికి ఉండదు. ఏ నూటికో కోటికో ఒకరికి ఇలాంటి సేవాభావం ఉంటుంది. అలాంటి గుణం ఉండటం గొప్ప విషయమే.
ఇక్కడ మనం చూస్తున్న వ్యక్తి అందరికి సుపరిచితుడే. తన తోటల్లో పండిన అరటిపండ్లు, జామపండ్లు, సపోటాలు తీసుకొచ్చి ప్రజలకు పంచుతుంటాడు. దీంతో అతడంటే అందరికి అభిమానమే. తనకున్న దాంట్లో సేవా గుణంతో నలుగురికి పంచడం గమనార్హం. అది కూడా ఎలాంటి డబ్బు తీసుకోకుండా దానం చేస్తుంటాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న వారందరికి అతడి గురించి తెలుసు.
ప్రతినిత్యం పండ్లు దానం చేస్తూ ప్రజల ఆకలి తీరుస్తుంటాడు. అతడి మానవత్వానికి అందరు ముగ్దులవుతున్నారు. ఇంత మంచి పని చేస్తున్న అతడి గురించి మనం తెలుసుకోవడం అవసరమే. అలాంటి సేవా గుణం ఉంటే నలుగురికి మేలు కలుగుతుంది. తన తోటలో పండిన పండ్లను ధర కట్టకుండా ఉచితంగా తన వాహనంలోనే తీసుకొచ్చి ఇవ్వడం గమనార్హం.
ఏలూరుకు చెందిన తమ్మినేని నాగరాజు ఆస్పత్రి, ఇతర ప్రదేశాల్లో తన వాహనంలో పండ్లు తీసుకొచ్చి అందరికి పంచుతుంటాడు. పేదవారి ఆకలి తీర్చడంలో అతడు చేస్తున్న పనికి అందరు ఫిదా అవుతున్నారు. అతడి మానవతావాదానికి జై కొడుతున్నారు. ఇంత మంచి వ్యక్తి గురించి అందరికి తెలిసేలా చేయాలని అందరు భావిస్తున్నారు.