Vijay Sethupathi : అభిమాని పెళ్లిలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి.. మరీ ఇంత సింపులుగానా..!

Vijay Sethupathi

Vijay Sethupathi

Vijay Sethupathi : మామూలుగా సినిమా స్టార్లు అంటే ఫ్యాన్స్ రెచ్చిపోవడం మామూలే. అలాగే కొంతమంది స్టార్లు కూడా వాళ్ళ ఫ్యాన్స్ ని అదే రేంజ్ లో ట్రీట్ చేస్తుంటారు. వాళ్లకి ఏ అవసరం వచ్చినా ముందు ఉంటారు. తాజాగా తమిళ స్టార్ విజయ్ సేతుపతి తన అభిమాని పెళ్లికి హాజరయ్యాడు.

మధురై జిల్లా ఉసిలంబట్టి పరిధి కీజాపుదూర్ కు చెందిన జయబాస్, జయపాల్ ఇద్దరూ విజయ్ సేతుపతికి వీరాభిమానులు. అందులో ఒకరు విజయ్ సేతుపతి జిల్లా అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా ఉండగా, మరొకరు జిల్లా ఉప కార్యదర్శిగా ఉన్నారు. ఈ ఇద్దరు తాము ఇష్టపడ్డ అమ్మాయిలను జూన్ 2న పెళ్లి చేసుకోబోతున్నారు.

అయితే, విజయ్ సేతుపతికి 2వ తేదీలో షూటింగ్ ఉండడంతో ముందుగానే వధూవరులను ఆశీర్వదించేందుకు వారి ఇంటికి వెళ్లారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. విజయ్ సేతుపతిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్ విజయ్ సేతుపతిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

TAGS