JAISW News Telugu

Tamannah : చిక్కుల్లో పడిన తమన్నా.. ముంబై ఈడీ ఆఫీసులో స్టార్ హీరోయిన్ విచారణ

Tamannah

Tamannah

Tamannah : స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా చిక్కుల్లో పడింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఆమె పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఈ స్టార్ హీరోయిన్ ‌ను ప్రశ్నించింది. అక్టోబరు 17న గౌహతిలో ఈడీ ముందు హాజరైన తమన్నాకు మహదేవ్ బెట్టింగ్ యాప్,  ఆన్‌లైన్ గేమింగ్ గురించి అధికారులు ప్రశ్నించారు.

మహదేవ్ ఆన్‌లైన్ గేమింగ్ సపోర్టివ్ బెట్టింగ్ యాప్  ఫెయిర్‌ప్లేలో ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించడాన్ని తమన్నా భాటియా చట్టవిరుద్ధంగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఈడీ తమన్నాకు సమన్లుపంపింది. దీంతో తమన్నా భాటియా తన తల్లితో కలిసి గౌహతిలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు.

గతంలోనూ విచారణ
మహదేవ్ బ్యాటింగ్ యాప్ కేసు విషయంలో తమన్నాను విచారించడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఫెయిర్‌ప్లే యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రమోట్ చేశారనే ఆరోపణలపై మహారాష్ట్ర సైబర్ సెల్ తమన్నాకు సమన్లు పంపింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ సంచలనంగా మారింది. 15 వేల కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు అంచనా.

మహదేవ్ బ్యాటింగ్ యాప్ వయాకామ్ 18 అనుమతి లేకుండా ఐపీఎల్ మ్యాచ్‌లను చట్టవిరుద్ధంగా ప్రసారం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో తమకు భారీ నష్టం వాటిల్లిందని వయాకామ్ 18 సంస్థ ఆరోపించింది. తమన్నా భాటియా ఫెయిర్‌ప్లే యాప్‌తో సంబంధం కలిగి ఉన్నట్లు నివేదించింది. మహదేవ్ సపోర్టింగ్ యాప్ ఫెయిర్‌ప్లేని ప్రమోట్ చేయడంతో తమన్నా చిక్కుల్లో పడింది.

Exit mobile version