Tamannaah : తమన్నాను అలా ట్రాప్ చేశా..! విజయ్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
Tamannaah : సౌత్ లో కెరీర్ మొదలు పెట్టి బాలీవుడ్ లో సెటిలైన అతికొద్ది మంది హీరోయిన్లలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. సౌత్ లో సెకండ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ నెమ్మదిగా బడా ఆఫర్స్ ను తన వైపునకు మళ్లించుకుంది. అక్కడ నుంచి తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.
ఆ సమయంలో హిందీలో సినిమాలు చేసింది. కానీ పూర్తి దృష్టి సౌత్ నుంచి మళ్లించలేదు. ఇప్పుడు మాత్రం తన దృష్టిని నార్త్ పైనే నిలుపుతుంది. దక్షిణాదిలో హీరోయిన్స్ సంఖ్య రాను రాను పెరుగుతూ పోతోంది. దీంతో వెబ్ సిరీస్, వెబ్ షోస్ స్టార్ట్ చేసింది.
ఇలానే చేసిన ఒక వెబ్ సిరీస్ తో తన లవ్ ట్రాక్ కూడా మొదలు పెట్టిందట. హిందీలో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే అడల్ట్ అంథాలజీలో తమన్నా నటించింది. అదే సిరీస్ లో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ కూడా నటించారు. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటి సారి. అయితే అంతకు ముందు నుంచే వీరు డేటింగ్ లో ఉన్నారు? అసలు వీరి కథ ఎక్కడి నుంచి మొదలైందో ఆమె ప్రియుడు విజయ్ వెర్మ రివీల్ చేశాడు.
తనకి తమన్నా అంటే ఎంతో విపరీతమైన ప్రేమ అని, ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. తమ పరిచయం ‘లస్ట్ స్టోరీస్ 2’ నుంచే మొదలయ్యిందని క్లారిటీ ఇచ్చాడు. షూటింగ్ సమయంలోనే పరిచయం, డేటింగ్ ఆ తర్వాత ప్రేమగా మారిందని తెలిపాడు. అయితే లస్ట్ స్టోరీస్ పూర్తయ్యాక 20 నుంచి 25 రోజుల్లో మొదటి డేట్ కు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అజయ్ వర్మ అసలు విషయం చెప్పాడు.
ఇక, అక్కడి నుంచి తాము చాలా సార్లు కలుసుకునేవాళ్లం అని నేను కూడా తమన్నా కుటుంబాన్ని కలిసేవాడినని వారికి కూడా నేను నచ్చడంతో అలా తమ బంధం మరింత బలపడిందని చెప్పుకొచ్చాడు. ఇలా వీరి కథ ‘లస్ట్ స్టోరీస్’తో మొదలై ‘లవ్ స్టోరీ’గా మారింది. మరి ఈ జంట ఎప్పుడు పెళ్లి వార్త చెబుతుందో అని ఫాలోవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తమన్నా ఇప్పుడు తెలుగులో ‘ఓదెల 2’ చేస్తుండగా బాలీవుడ్ లో పలు ప్రాజెక్టులు చేస్తోంది. విజయ్ వెర్మ ముఖ్య పాత్రలో నటించిన రీసెంట్ క్రేజీ అండ్ యాక్షన్ డ్రామా సిరీస్ ‘మిర్జాపూర్ సీజన్ 3’ అమెజాన్ లో స్ట్రీమ్ అవుతుంది. తమన్నా నటించిన తమిళ హారర్ చిత్రం ‘బాక్’ డిస్నీ + హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది.