Tamannaah : నాతో రొమాన్స్ చెయ్యడానికి హీరోలు పడే కష్టాలు చూస్తే బాధేస్తుంది అంటూ తమన్నా షాకింగ్ కామెంట్స్!
Tamannaah : సౌత్ ఇండియా లో అత్యంత క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే తమన్నా కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. అందం, నటన, డ్యాన్స్ ఇలా ఏది తీసుకున్న తమన్నా కి పోటీ ఇచ్చే హీరోయిన్ నేటి తరం హీరోయిన్స్ లో రాలేదనే చెప్పాలి. తెలుగు, హిందీ, తమిళం ఇలా అన్నీ భాషల్లో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించిన తమన్నా, ఏనాడు కూడా ముద్దు సన్నివేశాల్లో మరియు శృంగారపు సన్నివేశాల్లో నటించలేదు.
కానీ రీసెంట్ గా ఆమె వెబ్ సిరీస్ లలో హద్దులు దాటి మరీ రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తుంది. అసలు ఇన్ని రోజులు మనం చూసిన తమన్నా వేరు, ఇప్పుడు చూస్తున్న తమన్నా వేరు. అసలు ముద్దు సన్నివేశాలు లేదు అంటేనే సినిమాలకు సంతకం చేసే స్థాయి నుండి, నేడు అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలే చెయ్యడం ఆమె అభిమానుల్ని బాధిస్తుంది.
ఇది ఇలా ఉండగా తమన్నా రీసెంట్ గా కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసింది. రొమాంటిక్ సన్నివేశాలు చేసేటప్పుడు హీరోలు ఎంత ఇబ్బంది పడుతారో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘చాలా మంది ఆడియన్స్ కి హీరోలకు హీరోయిన్స్ తో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం ఇష్టం అని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్లకి అతి కష్టమైనది రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడమే. ఎందుకంటే అందరి ముందు రొమాంటిక్ సన్నివేశాలు చెయ్యడం చాలా ఇబ్బందిగా అనిపిస్తాది. వాళ్ళకే కాదు, మాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఒక్కోసారి ఈ సన్నివేశాలు చెయ్యడం వల్ల మా మూడ్ డిస్టర్బ్ అయ్యి మాట్లాడుకోకుండా ఉన్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి’ అంటూ తమన్నా ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. రీసెంట్ గా ఆమె ‘జీ ఖర్దా’ మరియు ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ సినిమాల్లో ఎంత హాట్ గా నటించిందో మనమంతా చూసాము.
బెడ్ రూమ్ సన్నివేశాలు, శృంగార సన్నివేశాలు చెయ్యడానికి ఆమె ఏమాత్రం వెనుకాడలేదు. ఇకపోతే ఆమె గత ఏడాది చేసిన సినిమాల్లో ‘జైలర్’ చిత్రం పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వగా , భోళా శంకర్ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె ప్రస్తుతం ‘ఆర్మనై 4’ మరియు ‘వేదా’ వంటి చిత్రాల్లో నటిస్తుంది. ఈ సినిమాల తర్వాత మళ్ళీ ఆమె ఎలాంటి కొత్త చిత్రానికి సంతకం చెయ్యలేదు.