Tamanna Love Marriage : సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో తమన్నా కచ్చితంగా ఉంటుంది. మంచు మనోజ్ హీరో గా నటించిన ‘శ్రీ’ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈమె, ఆ తర్వాత తమిళం లో పలు సినిమాలు చేసి , మళ్ళీ తెలుగులో ‘హ్యాపీ డేస్’ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
వరుసగా హిట్ మీద హిట్ కొడుతూ అనతి కాలం లోనే స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కేవలం తెలుగు లో మాత్రమే కాదు, తమిళం, కన్నడం, హిందీ మరియు మలయాళం భాషల్లో కూడా ఈమె స్టార్ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ లను అందుకుంది. అలా పాన్ ఇండియా లెవెల్ లో పేరు తెచ్చుకున్న ఈమె ఇప్పటికీ కూడా టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఇదంతా పక్కన పెడితే తమన్నా అతి త్వరలోనే విజయ్ వర్మ అనే బాలీవుడ్ నటుడిని పెళ్లాడబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరు చాలా కాలం నుండి డేటింగ్ చేసుకుంటున్నారు. ఇద్దరు కలిసి అనేకసార్లు పార్టీలకు పబ్బులకు కలిసి వెళ్లడం మీడియా కూడా చూసింది. అంతే కాకుండా వీళ్లిద్దరు కలిసి చేసిన ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే చిత్రం ఓటీటీ లో విడుదలై ఎంత సంచలనం సృష్టించిందో అందరం చూసాం. ఇదంతా పక్కన పెడితే విజయ్ వర్మ కంటే ముందు తమన్నా ఒక తమిళ స్టార్ హీరోతో అప్పట్లో ప్రేమాయణం నడిపింది. ఆ హీరో మరెవరో కాదు, కార్తీ. ఇతనితో తమన్నా అప్పట్లో ‘ఆవారా’ అనే చిత్రం చేసింది. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి విక్రమార్కుడు చిత్రాన్ని ‘చిరుత్తై’ అనే పేరుతో తమిళం లో రీమేక్ చేసారు. ఈ రెండు సినిమాల షూటింగ్ సమయం లోనే ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.
ఆ సాన్నిహిత్యం కాస్త ప్రేమగా మారింది. అంతే కాకుండా ఆరోజుల్లో వీళ్లిద్దరికీ రహస్యం గా పెళ్లి అయిపోయింది అంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ అని కార్తీ కొట్టిపారేశాడు కానీ, తమన్నా మాత్రం ఇప్పటి వరకు ఈ రూమర్స్ గురించి స్పందించలేదు. దాంతో వీళ్లిద్దరి మధ్య నిజంగా ప్రేమ వ్యవహారం నడిచిందా లేదా అనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్కుగానే మిగిలింది.