JAISW News Telugu

Batting consultant : బ్యాటింగ్ కన్సల్టెంట్ గా  ఆ క్రికెటర్ ను తీసుకోండి  

batting consultant

batting consultant

batting consultant : న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ఓటమి పాలడంతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  టాప్ ప్లేయర్లంతా పెద్దగా పరుగులేమి చేయకుండానే వెనుదిరగడంతో అసహనం వ్యక్తమవుతున్నది. ఇదేమి ఆటతీరు అని సగటు క్రికెట్ క్రీడాభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.
స్టార్ బ్యాట్స్ మెన్లు అయిన విరాట్ కోహ్లీ,  రోహిత్ శర్మ కూడా ఫామ్ లో లేకపోవడం జట్టుకు తీవ్రంగా పరిణమించింది. సీనియర్  ప్లేయర్లు రాణించకపోవడంతో  జట్టు కష్టాల్లో పడింది.  ఇప్పుడు ఉన్న ప్లేయర్లు మరింత రాణించాలంటే క్రికెట్ దిగ్గజంతో బ్యాటింగ్ పాఠాలు చెప్పించాలని మాజీ క్రికెర్, మాజీ కోచ్ డబ్ల్యూ వీ రామన్ బీసీసీఐకి  సూచన చేశాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గొప్ప ప్లేయర్ సచిన్ టెండూల్కర్‌ అని, ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియాకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా సచిన్ ను తీసుకోవాలని సూచించారు. టెండూల్కర్ నైపుణ్యంతో టీమిండియా జట్టుకు  ప్రయోజనం కలుగుతుతందని రామన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.  “బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారతజట్టు రాణించాలంటే టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను టీమ్ ఇండియాకు బ్యాటింగ్ కన్సల్టెంట్ గా  తీసుకోవడం ఉత్తమమని సూచించారు. మొదటి, రెండో టెస్ట్ మధ్య చాలా సమయం ఉందన్నారు. ప్రస్తుతం టీమ్‌లో కన్సల్టెంట్లను చేర్చుకోవడం సర్వసాధారణమైపోయింని, ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లు తమ ప్లేయర్లను ప్రకటించాయి. ఇటీవల న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో 3-0 తేడాతో ఓటమి పాలైన టీమ్ ఇండియా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ రేసు నుంచి తప్పుకునే ప్రమాదంలో పడింది. నేరుగా ఫైనల్స్‌కు చేరాలంటే ఈ సిరీస్‌ను టీమిండియా 4-0తో కైవసం చేసుకోవాలి.  లేకుంటే టీమిండియా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

రోహిత్, కోహ్లీ ఫామ్ కోల్పోవడం జట్టుకు ఆందోళనకరంగా మారింది ఈ సంవత్సరం, బంగ్లాదేశ్,  న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లతో సహా 5 టెస్ట్ మ్యాచ్‌లలో 10 ఇన్నింగ్స్‌లలో విరాట్ కోహ్లీ  కేవలం192 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ పదకొండు టెస్టు మ్యాచ్‌ల్లో 29.40 సగటుతో 588 పరుగులు చేశాడు.  కోహ్లీ 6 టెస్టుల్లో 22.72 సగటుతో 250 పరుగులు మాత్రమే చేశాడు.

Exit mobile version