YouTuber Harshasai : యూట్యూబర్ హర్షసాయిపై నార్సింగి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు పరారీలో ఉన్న అతడిని పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. యూట్యూబర్ హర్షసాయి విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. హర్షసాయి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడని సైబరాబాద్ సీపీకి బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హర్షసాయి విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
మెగా సినిమా కాపీ రైట్స్ కోసం తనపై లైంగిక దాడి చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటి నుంచి పరారీలో హర్ష సాయి ఉన్నాడు. పెద్ద నేరస్తులను సైతం వేగంగా అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులకు యూట్యూబర్ హర్షసాయిని పట్టుకోవడం సవాల్ గా మారింది. హర్షసాయి ప్రస్తులం బెంగళూరులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.