Deputy CM Pawan : నేను తప్పు చేసినా చర్యలు తీసుకోండి అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు, ఏపీ పునర్ నిర్మాణం కోసం జనసేన పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని అన్నారు. ఎందరో మహానుభావులు తెలుగు నేలపై జన్మించారని, వారందరి స్ఫూర్తితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెల్దామని పిలుపునిచ్చారు.
‘‘ఉచిత ఇసుక వంటి వ్యవహారాల్లో జనసేన సభ్యుల పాత్ర ఉండకూడదు. కూటమి ప్రభుత్వానికి ఇబ్బందుు కలుగజేసేలా వ్యవహరిస్తే ఏ సభ్యుడినైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా. తప్పులు చేస్తే నాతో సహా ఎంతటివారైనా చట్టపరంగా చర్యలు తీసుకోండి. వ్యక్తులు తప్పులు చేస్తే వ్యక్తిగతంగా వారికే ఆపాదించాలి కానీ పార్టీలకు కాదు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు కనుసన్నల్లో పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.