Polavaram Project : ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన నీటి వనరు పోలవరం. ఇది పూర్తయితే రాష్ట్ర భవితవ్యం మారిపోతుంది. దీనికి జాతీయ హోదా కూడా లభించింది. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా పరిస్థితి మారింది. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాల్సిన పాలకులే మీనమేషాలు లెక్కిస్తూ ఆలస్యం చేస్తున్నారు. ఫలితంగా ఏటికేడు బడ్జెట్ పెరిగిపోతోంది.
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కింది. దీంతో ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడానికి కేంద్రం సుముఖంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. జగన్ సీఎం అయ్యాక పనులు ముందుకు సాగలేదు. ఫలితంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారిపోయింది. కానీ పనుల్లో వేగం కనిపించడం లేదు.
పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లను తరుచూ మారుస్తున్నారు. కమీషన్ల కక్కుర్తి కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారనేది ఆరోపణ. ఫలితంగా నిర్మాణంలో నిర్లక్ష్యం కనిపించింది. టెక్నాలజీ పేరుతో కాలయాపన చేస్తోంది. వేగంగా పనులు పూర్తి చేసి ఉంటే ఈపాటికే పోలవరం పూర్తయ్యేది. కానీ ప్రభుత్వ అసంబద్ధ విధానాల వల్ల ఆలస్యం పెరిగిపోయింది.
ఏడాదిలోగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోతే మీసం తీయించుకుంటామని ఇద్దరు మంత్రులు అనిల్ కుమార్, అంబటి రాంబాబు తొడగొట్టి మరీ సవాలు చేశారు. కానీ ఇప్పుడేమైంది? ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. దీంతో ఓట్లు వేయాలని ఎలా అడుగుతారు? వైసీపీని గెలిపించమని ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలోనే కాదు రాష్ట్రంలో డెవలప్ మెంట్ పనులు చేపట్టలేదు. ఏమైనా మీట నొక్కడం ప్రజల ఖాతాల్లో డబ్బులు వేయడం. అయిపోయిందని అనుకోవడంతోనే కాలం గడిచిపోయింది. ఇప్పుడు నీవు చేసిన పని ఏదైనా ఉందా? అంటే సమాధానం లేదు. ఏ ఒక్క పని కూడా చేపట్టలేదు. రోడ్లయితే అధ్వానంగా ఉన్నాయి. కానీ మన పాలకులు ఇప్పుడు ఓట్లేయమని ఎలా అడుగుతారో చూడాల్సిందే.