T20 World Cup-2024 : T20 వరల్డ్ కప్-2024 కోసం ఏప్రిల్ 30న 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్ టాప్ ఆర్డర్లో కీలక ఆటగాళ్లు కాగా, పంత్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్గా, శాంసన్ బ్యాకప్ ఆప్షన్గా ఉన్నారు. పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఆల్ రౌండర్లు కాగా, స్పిన్ విభాగంలో యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ లలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్లతో కూడిన పేస్ విభాగానికి నాయకత్వం వహిస్తుండగా, శుభ్మన్ గిల్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, రింకు సింగ్ ట్రావెలింగ్ రిజర్వ్లుగా అమెరికా వెళ్లనున్నారు.
2024 టీ20 వరల్డ్కప్ షెడ్యూల్
తేది (అమెరికా) మ్యాచ్ లు సమయం వేదిక
05 జూన్ భారత్ వర్సెస్ ఐర్లాండ్ రాత్రి 8:00 గంటలు న్యూ యార్క్
09 జూన్ భారత్ వర్సెస్ పాకిస్థాన్ రాత్రి 8:00 గంటలు న్యూ యార్క్
12 జూన్ అమెరికా వర్సెస్ ఇండియా రాత్రి 8:00 గంటలు న్యూ యార్క్
15 జూన్ ఇండియా వర్సెస్ కెనడా రాత్రి 8:00 గంటలు ఫ్లోరిడా
జూన్ 05, 2024న న్యూయార్క్ లోని నస్సావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్ తో, జూన్ 09, 2024న అదే వేదికపై పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది. జూన్ 12, 15 తేదీల్లో వరుసగా అమెరికా, కెనడాతో భారత్ తలపడనుంది.
టీ20 వరల్డ్ కప్ గ్రూప్స్
గ్రూప్ ఏ గ్రూప్ బీ గ్రూప్ సీ గ్రూప్ డీ
కెనెడా ఆస్ట్రేలియా ఆఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్
భారత్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ నేపాల్
ఐర్లాండ్ నమీబియా పపువా న్యూ గినియా నెదర్లాండ్స్
పాకిస్తాన్ ఒమన్ ఉగాండా దక్షిణ ఆఫ్రికా
USA స్కాట్లాండ్ వెస్ట్ ఇండీస్ శ్రీలంక.