T20 Australia Team : టీ20 ఆస్ర్టేలియా జట్టు ఎంపికపై అభిమానుల ఆగ్రహం
T20 Australia Team : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తన 15 మంది సభ్యుల జట్టును బుధవారం ప్రకటించింది. మిచెల్ మార్ష్‌కు ఆస్ర్టేలియా జట్టు కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. స్పిన్ బౌలర్ ఆడమ్ జంపా కూడా జట్టులోకి వచ్చాడు. టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ తన జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. ఐపీఎల్ 2024లో సంచలనం సృష్టించిన యువ బ్యాట్స్‌మెన్ జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్‌కు చోటు దక్కలేదు. అలాగే టీ20 వరల్డ్ కప్ లో ఆడే జట్టులో స్టీవెన్ ను తీసుకోలేదు. అతడిని ఆస్రేలియా క్రికెట్ బోర్డు పక్కనపెట్టిందిజ ఇక మ్యాట్ షార్ట్, జేసన్ బెహ్రెన్ డార్ఫ్, ఆరోన్ హోర్డీ స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్ లెట్ ను కూడా జట్టులోకి తీసుకోలేదు.
కెప్టెన్సీకి కమ్మిన్స్ కు నోచాన్స్
ప్రస్తుతం ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సీనియర్ పాట్ కమ్మిన్ కు కెప్టెన్ బాధ్యతలు ఇవ్వలేదు. అతని స్థానంలో డాషింగ్ క్రికెటర్ మిచెల్ మార్ష్ ను తీసుకున్నారు. కాగా గత ఏడాది ఇండియాలో నిర్వహించిన ఐసీసీ వరల్డ్ కప్ లో ఆస్ర్టేలియాను చాంపియన్ గా నిలబెట్టింది కమ్మిన్సే. అయినా అతడికి కెప్టెన్ గా అవకాశం ఇవ్వలేదు.
జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్‌ని ఎంపిక చేయకపోవడంపై అభిమానుల ఆగ్రహం
ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ బ్యాటింగ్ లో అద్భుతంగా ఠాణిస్తున్నాడు. ధాటిగా ఆడుతున్న అతని బ్యాటింగ్ చూసి, అతను ఆస్ట్రేలియా T20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కడం ఖాయమని అంతా భావించారు. కానీ సెలెక్టర్లు అతనిని పక్కనపెట్టారు. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో సెలెక్టర్లపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆస్ట్రేలియా టీ20 ప్రపంచ కప్ 2024 జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా.