WI Vs PNG : రెండు సార్లు టీ 20 చాంపియన్ అయిన వెస్టిండీస్, పపువా న్యూ గినియా మధ్య టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ గయనాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరగనుంది. వెస్టిండీస్ రావ్ మెన్ పావెల్ సారథ్యంలో టీ 20 మ్యాచులు ఆడనుంది. నికోలస్ పూరన్, పావెల్, బ్రెండన్ కింగ్, రోమారియో షెపర్ట్, హిట్ మెయిర్, ఫై హోప్ లతో విండీస్ టీం చాలా బలంగా కనిపిస్తోంది.
రావ్ మెన్ పావెల్ బ్యాటింగ్, బౌలింగ్ లతో అదరగొట్టేలా కనిపిస్తోంది. 2012, 2016 సంవత్సరంలో రెండు సార్లు టీ 20 విశ్వ విజేత గా నిలిచిన కరేబియన్ టీం ఈ సారి కూడా కప్ కొట్టి తమ సత్తా నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. టీ 20 అనగానే పూనకాలు వచ్చినట్లు ఆడే విండీస్ బ్యాటర్లను వారి సొంత గడ్డపై ఓడించడం చాలా కష్టమైన పనే.
విండీస్ టోర్నీలో పపువా న్యూ గినియా తో గయానాలో తనకు అచ్చొచ్చిన పిచ్ పై మ్యాచ్ ఆడనుంది. ఈ గ్రూపులో ఇదే చాలా ఈజీ మ్యాచ్ గా కనిపిస్తోంది. అప్గానిస్తాన్, న్యూజిలాండ్ టీంలు ఈ గ్రూపులో ఉండగా.. టాప్ 2 జట్లు మాత్రమే సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. ఆఫ్రికా ఖండం నుంచి జింబాబ్వేను ఓడించి అతి పెద్ద టోర్నీకి అర్హత సాధించిన జట్టు ఉగాండా.
ఉగాండా, పపువా న్యూ గినియాతో మ్యాచ్ ఈజీ అయినప్పటికీ న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ మీద గెలిస్తేనే విండీస్ సూపర్ 8కు అర్హత సాధిస్తుంది. న్యూ గినియా కెప్టెన్ గా బ్యాటింగ్ ఆల్ రౌండర్ అసద్ వాలా వ్యవహరించనున్నాడు. ఈ జట్టుకు జింబాబ్వే మాజీ వికెట్ కీపర్ తతేంబు తైబు కోచ్ గా పని చేస్తున్నాడు.విండీస్ కోచ్ గా మాజీ ఆటగాడు డారెన్ సామి ఉండగా.. అసిస్టెంట్ కోచ్ లుగా కార్ల్ హుపర్, జేమ్స్ ప్రాంక్లిన్ లు జట్టును ముందుండి నడిపిస్తున్నారు.