T-20 World Cup 2024 : టీమిండియాకు భారీ షాక్..ఆ మ్యాచ్ కు కీలక ఆటగాళ్ల దూరం
T-20 World Cup 2024 : మండుటెండలు, అకాల వానల మధ్య సాగి అలరించిన ఐపీఎల్ చివరి దశకు వచ్చింది. మరో ఆరు రోజుల్లో ఈ సంబరం ముగిసిపోనుంది. ఇంతకుమించిన మరో సంబరం పొట్టి ప్రపంచకప్ జూన్ 2న ప్రారంభం కాబోతోంది. క్రికెట్ ఫ్యాన్స్ కు మరో నెల పాటు నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ అందించనుంది. ఐసీపీ వరల్డ్ కప్ టోర్నీ కావడంతో మరింత మజా తీసుకురానుంది.
ఐపీఎల్ చివరి దశకు రావడంతో కొంత మంది ఆటగాళ్లు వరల్డ్ కప్ టోర్నీ జరిగే అమెరికాకు త్వరలోనే ఉన్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ ముగిసినా తర్వాత వెళ్లనున్నారు. జూన్ 1న టీమిండియా, బంగ్లాదేశ్ తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. టోర్నీకి ముందు ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్ ను టీమిండియా ఆడనుంది. దీంతో మరో మూడు నాలుగు రోజుల్లో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, బుమ్రా, సూర్య ఇతర క్రికెటర్లు అమెరికా వెళ్లనున్నారు.
అయితే సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్ తో పాటు విరాట్ కోహ్లీ, సిరాజ్ మాత్రం వార్మప్ మ్యాచ్ కు దూరమయ్యే అవకాశం ఉంది. టీమిండియా జూన్ 5న తొలి మ్యాచ్ ఆడనుంది. అంతకుముందు వార్మప్ మ్యాచ్ ఆడితే అక్కడి పరిస్థితులు అర్థమయ్యేవి. కానీ ఐపీఎల్ పూర్తి చేసుకుని ఆలస్యంగా వెళ్లే ఈ ఆటగాళ్లకు ఆడే చాన్స్ ఉండడం లేదు.
ఈ సీజన్ లో అనూహ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ కు చేరుకుంది. మే 22న జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఎలిమినేటర్ లో గెలిస్తే, మే 24న క్వాలిఫైయర్ 2 ఆడుతుంది. ఈ జట్టు ఫైనల్ కు చేరితే మే 27 అర్ధరాత్రి యూఎస్ కు బయలుదేరుతారు. అంటే ఎక్కువ రోజులు కోహ్లీ, సిరాజ్ ఐపీఎల్ లోనే ఆడాల్సి ఉంది. ప్రపంచకప్ కు ముందు తీవ్ర అలసటతోనే వారు పయనం కావాలి. వార్మప్ మ్యాచ్ కు ముందు వారికి కేవలం రెండు రోజులు మాత్రమే విశ్రాంతి దొరుకుతుంది. ఇది సరిపోదు ఆ తర్వాత జూన్ 5న ఐర్లాండ్ మ్యాచ్ ఆడాలంటే మరింత విశ్రాంతి ఇవ్వక తప్పదు. భారత్, న్యూయార్క్ మధ్య 9.5 గంటల టైమ్ డిఫరెన్స్ ఉంటుంది. వారు అక్కడి పరిస్థితులకు అలవాటు పడడం కష్టం. అందుకే ఈ ఆటగాళ్లు అందరూ వార్మప్ మ్యాచ్ ఆడే అవకాశం లేదు.