Swadesham Membership For Expatriates : ప్రవాసులకు సభ్యత్వం ప్రారంభించిన ‘స్వదేశం’

Swadesham Membership For Expatriates
Swadesham Membership For Expatriates : ప్రవాసులకు సేవలందిస్తున్న ‘స్వదేశం’ సంస్థ సభ్యత్వ నమోదును ప్రారంభించింది. మెంబర్ షిప్ కు సంబంధించి డిజిటల్ ఐడీ కార్డులను కూడా అందించనున్నట్లు నిర్వాహకురాలు స్వాతి చెప్తున్నారు. ‘స్వదేశం’ సభ్యత్వంతో ప్రవాసులకు సేవలను మరింత వేగంగా అందించే వీలు ఉంటుందని ఆమె పేర్కొన్నారు. మెంబర్ షిప్ కోసం ఎన్ఆర్ఐలు www.swadesam.comలో ఫొటోతో సహా వివరాలు ఫిల్ చేయాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. పూర్తి చేసుకున్న వారికి త్వరలో మెయిల్ ద్వారా డిజిటల్ ఐడీ కార్డులు అందిస్తామని తెలిపారు.
ఉద్యోగం, వ్యాపారం కోసం విదేశాలలో భారతీయులు స్థిరపడ్డారు. వారికి భారత్ నుంచి చాలా రకాల సేవలు అవసరం అవుతాయి. ఈ సేవలను పొందెందుకు బంధువుల, స్నేహితులను ఆశ్రయిస్తారు. అయితే ఒక్కోసారి వారు కూడా అందుబాటులో లేకపోవడం, వారికి సమయం లేదకపోవడం జరుగుతుంది. దీంతో ఎన్నారైలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ‘స్వదేశం’ తీసుకువచ్చారు. ఇది ఎన్ఆర్ఐల సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ అని ‘మీడియా బాస్ నెట్‌వర్క్’ సంస్థ నిర్వాహకులు స్పష్టం చేశారు.
56 దేశాల్లో ఉన్న ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సేవలు అందుబాటులో ఉన్నాయిన, త్వరలోనే ఇండియా వైజ్ గా ప్రధాన నగరాలకు సేవలను విస్తరిస్తామని పేర్కొన్నారు. ప్రతీ సంవత్సవరం లక్షల మంది ఉపాధి, విద్య, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తున్నారు. వారికి అవసరమైన సేవలను అందించేందుకు ‘స్వదేశం’ మంచి ఫ్లాట్ ఫామని ‘మీడియా బాస్ నెట్‌వర్క్’ సీఈవో స్వామి ముద్దం చెప్పారు.
‘స్వదేశం’ సర్వీసుల్లో పబ్లిక్ రిలేషన్స్, ఈవెంట్ మేనేజ్ మెంట్, మీడియా, ప్రాపర్టీ, లీగల్, రిజిస్ట్రేషన్, ఫ్రీలాన్స్ ఎప్లాయీస్, సెలబ్రెటీల మేనేజ్ మెంట్, వస్తువుల డెలివరీ, మాట్రిమోనీ సేవలు, ఆర్గనైజేషన్ మేనేజ్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి ఎన్నో రకాల సేవలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఎన్ఆర్ఐలకు ఎలాంటి సేవలు కావాలన్నా వన్ ఆండ్ ఓన్లీ ఫ్లాట్ ఫారం ‘స్వదేశం’ అన్నారు.