JAISW News Telugu

Philippines : ఫిలిప్పీన్స్ లో సంగారెడ్డి వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి

Philippines

Philippines

Philippines : సంగారెడ్డి జిల్లాకు చెందిన స్నిగ్ధ అనే వైద్య విద్యార్థిని ఫిలిప్పీన్స్ లో అనుమానాస్పదంగా మృతి చెందింది. పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన స్నిగ్ధ ఫిలిప్పీన్స్ లో వైద్య విద్యను అభ్యసిస్తోంది. తన పుట్టిన రోజు సందర్భంగా అర్ధరాత్రి సమయంలో స్నేహితులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లారు. అయితే, ఆమె గదిలో శవమై కనిపించడంతో స్నేహితులు భయాందోళనకు గురయ్యారు. స్నిగ్ధ తల్లిదండ్రులకు ఈ ఘటన గురించి తెలియజేశారు.

సమాచారం అందుకున్న పటాన్ చెరులోని ఆమె కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె తండ్రి అమృత్ రావు విద్యుత్ శాఖలో డీఈగా విధులు నిర్వర్తిస్తున్నారు మృతదేహాన్ని స్వదేశం రప్పించేందుకు ఫిలిప్పీన్స్ దేశ అధికారులతో సంప్రదింపులు జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Exit mobile version