Suspicious death : విజయవాడలో ఈవెంట్ డ్యాన్సర్ అనుమానాస్పద మృతి

Suspicious death
Suspicious death : విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ లో ఈవెంట్ డ్యాన్సర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతురాలని బంటుపల్లి వెంకటలక్ష్మి (25)గా గుర్తించారు. ఆమె కాకినాడ నుంచి వచ్చి గత కొంతకాలంగా విజయవాడలో ఉంటున్నారు. అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ఉరి వేసుకున్న స్థితిలో వెంకటలక్ష్మి మృతదేహం కనిపించింది. శరీరంపై గాయాలు ఉండడంతో స్థానికులు హత్యగా భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.