Suspicious death : ప్రైవేటు స్కూల్ లో బాలుడి అనుమానాస్పద మృతి

Suspicious death
Suspicious death : జహీరాబాద్ లోని ఓ ప్రైవేటు స్కూలులో ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పాఠశాల వసతి గృహంలో బాలుడి (12) మృతదేహం లభించింది. అతడి తల, పెదవులు, కనుబొమ్మలపై గాయాలు ఉన్నాయి. హాస్టల్ లోని మంచంపై నుంచి పడి మృతి చెందాడని స్కూల్ మేనేజ్ మెంట్ చెబుతోంది. జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనల్లో విద్యార్థి సంఘాలు కూడా పాల్గొన్నాయి.