Prathipati Pullarao : జగన్ పై దాడి ఘటనలో అనుమానాలు బలపడుతున్నాయి – మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

Prathipati Pullarao
Prathipati Pullarao : సిఎం జగన్ పై దాడి ఘటనలో తమ అనుమానాలు బలపడుతున్నాయని మాజీమంత్రి పుల్లారావు తెలిపారు. జగన్ కు తగిలింది రాయేనా? లేక ఎయిర్ బుల్లెట్టా..? అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై పోలీసులు ఎందుకు వివరాలు వెల్లడించలేదని ప్రశ్నించారు. దీంతో పోలీసుల తీరుపై అనుమానాలను పెంచుతోందని అన్నారు. వైకాపాకు విధేయులుగా ఉన్న పోలీసులను తక్షణం ఎన్నికల విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
సీబీఐచే విచారణ జరిపించాలి: బొండా ఉమా
సిఎం జగన్ కంటికి గాయమైతే ఆసుపత్రిలో పరీక్షించాలని, మీడియో సమక్షంలో వివరాలు వెల్లడించాలని టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా డిమాండ్ చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయి దాడి ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. ఈ అంశంపై గవర్నర్ ను కలుస్తామని చెప్పారు. దాడి ఘటనపై గగ్గోలు పెడుతున్న వైకాపా నేతలు సీబీఐ విచారణకు ఎందుకు ముందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు.