Suryakumar Catch : సూర్య క్యాచ్ వివాదం.. అంపైర్లపై సౌతాఫ్రికా ఫ్యాన్స్ ఫైర్ 

Suryakumar Catch

Suryakumar Catch

Suryakumar Catch : టీ 20 వరల్డ్ కప్ లో ఆఖరి ఓవర్ లో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్ ను సూర్య కుమార్ యాదవ్ అద్భుతంగా బౌండరీ లైన్ వద్ద పట్టుకున్న విషయం తెలిసిందే. ఇదే క్యాచ్ మ్యాచ్ విన్నింగ్ చేసిందని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ కొనియాడారు. క్రికెట్ లో ఇలాంటి క్యాచులు అరుదుగా కనిపిస్తుంటాయని.. ఇది టీ 20 వరల్డ్ కప్ విన్నింగ్ క్యాచ్ అంటూ ఆకాశానికెత్తేశారు. 

అయితే సూర్య కుమార్ యాదవ్ క్యాచ్ తీసుకున్న సమయంలో బౌండరీ లైన్ వద్ద బౌండరీ కుషన్ కు సూర్య కాలు తగిలిందని అది సిక్సు అని అంపైర్లు చీట్ చేశారని రాంగ్ నిర్ణయం ప్రకటించడం వల్లే ఓడిపోయాయమని సౌతాఫ్రికా అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మొన్నటి వరకు దీనిపై ఎలాంటి రాద్ధాంతం లేకున్నా.. కొంతమంది కావాలనే ఏదో సృష్టించాలని చేస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే సూర్య కాలు బౌండరీ కూషన్ కు తగిలిన అప్పటికే బాల్ అతడి చేతుల్లో లేదని గాల్లోకి ఎగరేశాడని భారత ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై వివాదం చినికి చినికి గాలి వానగా మారుతోంది. లేదు క్యాచ్ ను ఫేర్ గా తీసుకున్నాడని అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. అది కూడా థర్డ్ అంపైర్ చూసి ఒకటికి రెండు సార్లు పరిశీలించి దాన్ని అవుట్ గా ప్రకటించారు. కానీ ఇప్పుడెందుకు దాన్ని వివాదం చేస్తున్నారని ఇండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఓడిపోయిన ఆవేదనలో కావాలనే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. 

ఈ వివాదం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఐసీసీ, బీసీసీఐ, సౌతాఫ్రికా బోర్డు గానీ  స్పందించలేదు. ఇప్పుడు స్పందించినా చేసేదేమీ ఉండదు. కాబట్టి అనవసర వివాదాలకు తావివ్వకుండా మ్యాచ్ లో అంపైర్లు చేసిందే కరెక్ట్ అని ఇండియన్ ఫ్యాన్స్ అంటున్నారు.  ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం నువ్వు పట్టింది క్యాచ్ కాదు టీ 20 వరల్డ్ కప్పు అంటూ సూర్యను తెగ పొగిడేస్తున్నారు.

TAGS