Surya : సూర్య.. ఇదేందయ్యా.. రాజమౌళిని ఇలా మార్చేశావ్?
ఇక రాజమౌళి వేసిన దారి ఎంతో మంది దర్శకనిర్మాతలు, హీరోలకు ఎంట్రీ పాస్ లా మారింది. అదే సమయంలో సౌత్ సినిమా కంటెంట్ నార్త్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. భాషతో సంబంధం లేకుండా ఉత్తరాది ఆడియన్స్ ఇక్కడి సినిమాలను విపరీతంగా ఆదరిస్తున్నారు.
ఇక రాజమౌళి పాన్ ఇండియా సినిమాలే తీయడానికి కారణం ఏమిటనే సందేహాలు మొన్నటి దాకా అందరిలోనూ ఉన్నాయి. అయితే ఆ రహస్యాన్ని బయటపెట్టారు జక్కన్న. ఓ స్టార్ హీరోను ఇన్‌స్పిరేషన్ గా తీసుకున్నానని అందుకే పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇటీవల కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్ హీరో సూర్య గురించి రాజమౌళి చాలా గొప్పగా చెప్పారు.
గజినీ సినిమా సమయంలో సూర్య చేసిన ప్రమోషన్ ను తెగ మెచ్చుకున్నారు. సూర్య తమిళంలో చేసిన గజినీ సినిమాను తెలుగులో డబ్ చేసినప్పుడు, ఇక్కడ ఆయన ప్రమోషన్ చేసిన విధానం చాలా బాగా ఆకట్టుకుందన్నారు. తన భాషతో పాటు ఇతర ప్రాంతాల ప్రేక్షకులకు కూడా తన సినిమా రీచ్ అయ్యేందుకు చేస్తున్న ప్రయత్నం బాగుందని కితాబిచ్చాడు. మన టాలీవుడ్ హీరోలు కూడా ఇతర భాషా ప్రేక్షకులకు చేరువ కావాలని చెబుతున్నానని, ఆ ప్రయత్నాలు తన సినిమాల ద్వారా చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇన్ డైరెక్ట్ గా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రాజమౌళిని ఇలా మార్చేశాడా అని సినీ ఇండస్ట్రీలోని వారు చర్చించుకుంటున్నారు.