Musi areas : మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారుల సర్వే

Musi areas

Musi areas

Musi areas : మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 16 బృందాలు సర్వే చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో 5 బృందాలతో సర్వే జరుగుతోంది. నదీ గర్భంలోని నిర్వాసితుల నిర్మాణాల వివరాలను రెవెన్యూ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. మూసీ నదిలో ఉన్న బఫర్ జోన్ లోని నిర్మాణాలకు మార్క్ చేయనున్నారు.

చాదర్ ఘాట్, మూసానగర్, శంకర్ నగర్ లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు సర్వే చేపట్టారు. హిమాయత్ నగర్ తహసీల్దార్ సంధ్యారాణి ఆధ్వర్యంలో ఇది కొనసాగుతోంది. గోల్కొండ పరిధిలోని ఇబ్రహీంబాగ్ ప్రాంతంలోనూ సర్వే చేశారు. లంగర్ హౌస్ డిఫెన్స్ కాలనీలో అధికారులు సర్వే చేపట్టనున్నారు.

TAGS