Senior Actress : చాలా మంది మగాళ్లకు లొంగిపోయా.. సీనియర్ నటి సంచలన వ్యాఖ్యలు..

Senior Actress Jalalitha
Senior Actress Jalalitha : తెలుగు సీనియర్ నటుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా జయలలితకు మంచి గుర్తింపు ఉంది. 1990ల్లో వ్యాంప్ పాత్రల్లో ఆడియన్స్ అలరించేది. వాస్తవానికి జయలలిత చాలా అందంగా ఉంటారు. హీరోయిన్ కావాల్సి ఉండగా..ఆమెకు ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. ప్రతీ దర్శకుడు ఆమెకు వ్యాంప్ పాత్రలే ఇచ్చారు. హాట్ హాట్ పాత్రలతో అప్పటి కుర్రకారును హీరోయిన్స్ కు దీటుగా జయలలిత కూడా ఆకట్టుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన నటజీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగు ఇండస్ట్రీలో తనను రక్షించుకునేందుకు ఎటువంటి ప్రణాళికలు వేసుకోలేదన్నారు. అందరితో కలివిడిగా ఉండేదాన్నన్నారు. కొన్ని సార్లు తప్పించుకున్నప్పటికీ మరికొన్ని సార్లు లొంగిపోవాల్సి వచ్చేది అని చెప్పుకొచ్చింది. చాలా మంది మగాళ్లకు తాను లొంగిపోయానని తెలిపింది. అయితే ప్రేమ, పెళ్లి గురించి ఎవరూ మాట్లాడేవారు కాదని, అందంగా ఉండడంతో పాటు వ్యాంప్ పాత్రలు చేయడంతో చాలా మంది తన దగ్గరకు వచ్చి.. ‘అది’ అడిగేవారని చెప్పింది.
చాలా వరకు తప్పించుకున్నప్పటికీ కొన్ని సార్లు లొంగిపోయానని చెప్పుకొచ్చింది. అయితే తనను ఎవరు కూడా కొట్టడం, హింసించడం చేయలేదన్నారు. ఎవరు తనపై కోపం కూడా చూపలేదన్నారు. అందరూ కూడా పని అయిపోయిందా? లేదా? అన్నట్టుగా ఉండేవారు. పరిశ్రమలో తలుపులు కొట్టడం, అడగడం కామనే అని తెలిపింది. ఒకతను రాత్రి వచ్చి తలుపుకొట్టి తీయకపోతే ఉరేసుకుని చస్తానని బెదిరించాడు. అయితే నేను ఎప్పుడూ అటువంటి వాటికి బెదరలేదన్నారు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే ఓ దర్శకుడు సగం షూటింగ్ చేసిన తర్వాత వెళ్లిపొమ్మన్నాడు. వివాహ బంధం పెటాకులైన తర్వాత ప్రేమ, పెళ్లి, పిల్లల గురించి ఆలోచించలేదన్నారు. ఓపెన్ గా ఎన్నో విషయాలు చెప్పిన జయలలిత తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.