JAISW News Telugu

Sneha Reddy : ఇంస్టాగ్రామ్ ద్వారా అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి నెలకి ఎంత సంపాదిస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారు!

Sneha Reddy Instagram Earnings :

Sneha Reddy Instagram Earnings

Sneha Reddy Instagram Earnings : సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సంపాదించే మార్గాలు బాగా పెరిగిపోయాయి. కాస్త కళాపోషణ ఉన్న ఎవరైనా ఇంతకు ముందు సినిమాల్లోకి వెళ్లి తమ టాలెంట్ ని చూపించుకోవాలి అని కోరికతో ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఇంస్టాగ్రామ్ రీల్స్, టిక్ టాక్ వంటి యాప్స్ వచ్చాయో, అప్పటి నుండి నెటిజెన్స్ తమ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ మరియు యాక్టింగ్ వీడియోస్ టాలెంట్ చూపించి డబ్బులు సంపాదిస్తున్నారు.

అయితే టాప్ సెలబ్రిటీస్ కి ఇలాంటి అవసరం అసలు లేదు. వాళ్లకు సినిమాల్లో నటించినందుకు కోట్లలో డబ్బులు వస్తుంది. కానీ ఊరికే వచ్చేది ఎందుకు వదులుకోవాలి అని ఇంస్టాగ్రామ్ ద్వారా తమ బ్యాంకు అకౌంట్స్ ని లింక్ చేసి అలా వదిలేస్తున్నారు. వీళ్ళు అప్లోడ్ చేసే ఫోటోలు, వీడియోలకు లక్షల సంక్యతలో లైక్స్, వ్యూస్ రావడం వల్ల ఇంస్టాగ్రామ్ యాజమాన్యం నెలనెలా వీళ్ళ అకౌంట్స్ లో 30 నుండి 40 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా బ్యాంక్ అకౌంట్స్ లో జమ చేస్తూ ఉన్నారు.

పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి కూడా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా నెలకు లక్షల్లోనే సంపాదన అందుకుంటుంది అట. ఈమెకి ఇంస్టాగ్రామ్ లో స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ఫాలోయింగ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే ఎక్కువ అనొచ్చు. ఆమె అందం కి అలా ఫిదా అయిపోతూ ఉంటారు మన నెటిజెన్స్. అంతే కాకుండా అప్పుడప్పుడు ఆమె అప్లోడ్ చేసే తన పిల్లల ఫోటోలు, వీడియోల కోసం కూడా ఈమెని ఫాలో అవుతుంటారు నెటిజెన్స్. ముఖ్యంగా ఈమె కూతురు అల్లు అర్హ కి సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. క్యూట్ గా ఆమె మాట్లాడే మాటలు, చేసే చేష్టలు చూసి నెటిజెన్స్ మురిసిపోతూ ఉంటారు.

అలా ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్నందున, స్నేహ రెడ్డి కి నెలకు 60 లక్షల రూపాయిలు ఆమె అకౌంట్ లో క్రెడిట్ అవుతూ ఉంటుందట. ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ రేంజ్ సంపాదన మన టాలీవుడ్ లో కేవలం సమంత కి మాత్రమే ఉందట. ఆమె తర్వాతి స్థానం మాత్రం స్నేహ రెడ్డి దే అట. సినిమాల్లోకి వస్తే హీరోయిన్ గా ఈమెకి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చేవాల్లో తెలియదు కానీ, ఇంస్టాగ్రామ్ లో వచ్చినంత ఆదాయం రాదనీ మాత్రం చెప్పొచ్చు అని  అభిమానులు అంటున్నారు.

Exit mobile version