Suresh kondeti:సురేష్ కొండేటికి మరో షాక్..నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ బ్యాన్
Suresh kondeti:సంతోషం ఫిలిం అవార్డులు పీఆర్వో, నిర్మాత సురేష్ కొండేటికి వరుస షాకులిస్తున్నాయి. ఇటీవల సంతోషం అవార్డుల వేడుకని గోవాలో అత్యంత భారీ స్థాయిలో నిర్వహించిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఈ అవార్డు ఫంక్షన్‌ని విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్న సురేష్ కొండేటి ఈ ఏడాది కూడా అదే విధంగా నిర్వహించాలని ప్లాన్ చేశాడు. ఇందుకు గోవాని వేదికగా చేసుకున్నాడు. అదే అతనికి చేటుగా మారింది. గోవాలో నిర్వహించిన వేడకలో ఆర్టిస్ట్‌లకు సరైన సౌకర్యాలు కల్పించలేక ఫెయిలయ్యాడు.
దీంతో ఈ వేడకల్లో పాల్గొనడానికి గోవాకు చేరుకున్న ఆర్టిస్ట్‌లకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యమంగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్ట్‌లు తీవ్ర అవమానాలకు గురయ్యారు. దీంతో సురేష్ కొండేటి, తెలుగు ఇండస్ట్రీ కావాలనే మమ్మల్ని అవమానించిందని విమర్శలు చేయడం, చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించిన పీఆర్వో ఇలా ప్రవర్తించడం బాధించిందని ఫైర్ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అతనికి , మెగా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదని, తను మెగా ఫ్యామిలీ హీరోల్లో ఏ ఒక్కరికీ పీఆర్వో కాదని స్పష్టం చేశారు.
అంతే కాకుండా అవార్డుల నిర్వహణలో అతను ఘోరంగా విఫలమయ్యాడని, అతనికి మెగా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇటీవల సురేష్ కొండేటిపై మీడియా కొన్ని నెలల పాటు విధిస్తూ ప్రకటన చేసింది. తాజాగా సురేష్ కొండేటికి మరో షాక్ తగిలింది. తెలుగు నిర్మాతల మండలితో పాటు ఫిల్మ్ ఛాంబర్ అతనిపై బ్యాన్ విధిస్తూ తాజాగ ఆనిర్ణయం తీసుకుంది. అవార్డు వేడుక జరుగుతున్న సమయంలో మధ్యలోనే సురేష్‌కొండేటి బయటికి వెళ్లిపోయాడని, అక్కడికి వచ్చిన ఆర్టీస్టుల్లో కొంత మందిని తానే సొంత ఖర్చులతో సురక్షితంగా ఇంటికి పంపించినట్టు నిర్మాత కె.ఎల్. దామోదర ప్రసాద్ వెల్లడించారు.
ఈ పరిణామాల వల్ల ఇండస్ట్రీకి, ఫిల్మ్ ఛాంబర్‌కు చెడ్డ పేరు వస్తుందని భావించి సురేష్ కొండేటి దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాలని ఫిల్మ్‌చాంబర్, నిర్మాతల మండలి నోటీసులు జారీ చేసినా అతని నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తాజాగా అతన్ని బహిస్కరిస్తున్నట్టుగా ప్రకటించి షాక్ ఇచ్చారు.