BJP MP Suresh Gopi : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కేరళలో ఒక్క అసెంబ్లీ సీటు గెలిచిన దాఖలాలు లేదు. ఆ రాష్ట్రంలో ఇప్పటికీ వామపక్షాలదే హవా. వారితో పొత్తు పెట్టుకుంటే తప్ప గెలవలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంటుంది. అయితే వామ పక్షాలతో మాత్రం పొత్తుకు బీజేపీ పొసగదు కాబట్టి అక్కడ ఒక్క సీటు కాదు కదా.. గుప్పెడు ఓట్లు కూడా దక్కలేదు. ఆది గురువు శ్రీ ఆది శంకరా చార్యులు పుట్టిన నేల కేరళ. తన తల్లి చితికి నిప్పు ఇవ్వని పక్షంలో శంకరా చార్యుల శాపం వల్ల అక్కడ ఒక్క శక్తి పీఠం గానీ, జ్యోతిర్లింగం కాని లేవుని చరిత్ర చెప్తుంది. అలాంటి చోట ఆధ్యాత్మిక వాతావరణం చాలా తక్కువ.
ఎక్కడైతే భక్తి భావం, సుప్రసిద్ధ క్షేత్రాలు ఉండి ప్రజలు భక్తి వైపునకు నడుస్తారో అక్కడ బీజేపీకి మంచి భవిష్యత్ ఉంటుంది. అందుకే కేరళలో ఇప్పటి వరకు ఇక్క అసెంబ్లీ సీటు కూడా రాలేదు. ఇక 2024 కేరళ భవిష్యత్ లో సువర్ణాధ్యాయం లికించబడింది. అక్కడ జరిగిన లోక్ సభ ఎన్నికల్లో త్రిచూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి మళయాల నటుడు సురేశ్ గోపీ బీజేపీ తరుఫున నిలబడి విజయం సాధించాడు. ఇది బీజేపీ-కేరళ చరిత్రలో సువర్ణాధ్యాయమే.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల సురేశ్ గోపీకి విపరీతమైన అంకితభావం ఉంది. ఎన్నికలకు ముందు కొల్లూరు మూకాంబికా ఆలయంలో ఆయన చండీ హోమం నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం.. సువాసీనులను పూజించడం, వారికి చీర, సారె పెట్టడం లాంటి క్రతువులను చేసిన ఆయన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని చూసిన నెటిజన్లు సురేశ్ గోపీ భక్తి భావం చూసి మురిసిపోతున్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబం కూడా వేడుకల్లో పాల్గొన్న తీరు ముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.