CM Jagan Bail : జగన్ బెయిల్ రద్దు విషయంలో సుప్రీం కీలక నోటీసులు
CM Jagan Bail : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఎంపీ రఘు రామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ఈ రోజు (నవంబర్ 24)న విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ కు సంబంధించి జగన్, సీబీఐ సహా ప్రతి వాదులందరికీ న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఆయన తరుఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. జగన్ బెయిల్ అంశంపై సీబీఐ, ఈడీ సంస్థలు కనీసం సవాలు కూడా చేయలేదని రఘురామ కృష్ణం రాజు తరుఫు న్యాయవాది న్యాయస్థానంకు వివరించారు.
దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ‘బెయిల్ ఇప్పుడే రద్దు చేయాలా? అని పిటిషనర్ తరుఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ప్రస్తుతం నోటీసలు ఇచ్చి తర్వాతి ప్రక్రియ చేపట్టాలని రఘు రామ కృష్ణం రాజు తరుఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో విచారణను హైదరాబాద్ హై కోర్టు నుంచి ఢిల్లీ సుప్రీం కోర్టుకు మార్చాలని రఘు రామ ఇప్పటికే పిటీషన్ వేశారు. ఆ పిటిషన్ ను కూడా జత చేయాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు.