Ramanaidu Studios : కాదేదీ కవితకు అనర్హం శ్రీశ్రీ అన్నట్లు కాదేదీ కబ్జాకు అనర్హం అనుకుంటున్నారు. స్థలం కనబడిందా చాలు నొక్కేస్తున్నారు. ఏపీలోని విశాఖపట్నంలోని రామనాయుడు స్టూడియోను కబ్జా చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. షూటింగులకు అనువుగా స్టూడియోను అందంగా నిర్మించారు. కానీ వైసీపీ నేతల కన్నుతో స్థలాన్ని కబ్జా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో రూ. కోట్ల విలువైన భూమి ఇప్పుడు వైసీపీ నేతల పరం కానుందని అంటున్నారు.
సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో అందమైన స్టూడియో నిర్మించారు. స్టూడియోకు రామానాయుడు పేరు పెట్టినా స్థలం మాత్రం సురేష్ బాబు పేరు మీదే ఉంటుంది. ప్రభుత్వ పెద్దలే బెదిరింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. స్టూడియోను చూసిన వైఎస్ భారతి రెడ్డి మనసు పడ్డారని దీంతో దాన్ని స్వాధీనం చేసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
రామానాయుడు స్టూడియో కబ్జాకు వైసీపీ ప్రయత్నిస్తోందని అయ్యన్నపాత్రుడు చాలాసార్లు చెప్పారు. ఈ ప్రక్రియ విషయంలో లే అవుట్ గా మార్చాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. స్టూడియోకు కేటాయించిన స్థలం ఇళ్ల నిర్మాణాలకు కేటాయించడం చట్ట విరుద్ధమే. స్టూడియోను స్వాధీనం చేసుకుంటే న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
స్టూడయో యజమాన దగ్గుబాటి సురేష్ బాబు పేరు మీదే ఇళ్ల నిర్మాణం కోసం వేస్తున్నారు. కలెక్టర్ ఎన్వోసీ ఇచ్చారని చెబుతున్నారు. జీవోకు తగినట్లుగా నిర్మాణాలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం గమనార్హం. టీడీపీ ఎమ్మెల్యే రామక్రిష్ణ రాజు దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తే కనీసం నోటీసులు ఇవ్వకుండా కేసు కొట్టేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ప్రతివాదులకు, ప్రభుత్వానికి నోటీసు జారీ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.