Goutham:మహేష్ వారసుడు గౌతమ్ తెరంగేట్రానికి రంగం సిద్ధం?
Goutham Ghattamaneni:సూపర్ స్టార్ మహేష్ ఏజ్ ఇప్పుడు 48. అతడి సినీకెరీర్ ఏజ్ 24. అంటే తన వయసులో సగం జీవితాన్ని సినిమాకే అంకితమిచ్చాడు. ఇప్పుడు అతడి వారసుడు గౌతమ్ కృష్ణ వయసు 17. అంటే ఈ వయసుకు మరో ఏడేళ్లు కలుపుకున్నాకే మహేష్ హీరో అయ్యాడు. కానీ ప్రిన్స్ మహేష్ అప్పటికే టాలీవుడ్ లో పెద్ద స్టార్. చిన్న వయసు నుంచే నటనలో ఆరితేరాడు. తన తండ్రి కృష్ణ సినిమాల్లో ఆల్మోస్ట్ హీరో రేంజు పాత్రలతో బాలనటుడిగా వెలిగాడు. కొడుకు దిద్దిన కాపురం లాంటి సినిమాలో మహేష్ కీలక పాత్రతో లీడ్ చేసాడు. చబ్బీ బోయ్ లుక్ లో మహేష్ క్యూట్ నెస్ అద్భుత ప్రతిభకు స్టన్నయిపోయేవారు.
కానీ మహేష్ వారసుడు గౌతమ్ కృష్ణ అలా కాదు. అతడు బాలనటుడిగా మహేష్ లా ప్రయత్నించలేదు. అప్పట్లో తన తండ్రి మహేష్ నటించిన 1-నేనొక్కడినేలో అతిథి పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత ఒక వాణిజ్య ప్రకటనలో కుటుంబంలో ఒకడిగా గౌతమ్ కనిపించాడు. అది తప్ప మహేష్ తరహాలో బాలనటుడిగా పెద్ద పాత్రలు ఏవీ చేయలేదు. అయితే గౌతమ్ కృష్ణ నటుడు అవుతాడా? లేదా ఇంకేదైనా వృత్తిని ఎంపిక చేసుకుంటున్నాడా? అన్నదానికి ఇంకా స్పష్ఠత లేదు.
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా లెగసీని ముందుకు నడిపించడమే గాక స్టార్ డమ్ ని మరో లెవల్ కి చేర్చాడు మహేష్. ఇప్పుడు అతడి లెగసీని ముందుకు నడిపించే ఏకైక వారసుడు గౌతమ్ కృష్ణ మాత్రమే. అందువల్ల గౌతమ్ తెరంగేట్రం కోసం సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. తండ్రిలానే కనీసం 24 వయసుకు గౌతమ్ హీరో అయినా సరిపోతుందని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు గౌతమ్ తన ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ (అమెరికా) లో అడుగుపెడుతున్నాడు. ఇకపై అక్కడ యూనివర్శిటీలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.
అంటే అక్కడే ఫిలింస్టడీస్ ని కూడా పూర్తి చేస్తాడని భావించాలి. తన కుమారుడు న్యూయార్క్ లో ఉన్నత చదువులు కొనసాగిస్తాడని చెబుతూ సోషల్ మీడియాల్లో నమ్రత చాలా ఎగ్జయిట్ అయ్యారు. అందుకు సంబంధించిన ఫోటో కూడా వైరల్ అవుతోంది. అయితే మహేష్ స్టడీస్ అంతా రంగుల ప్రపంచంలోనే. అమెరికాలో చదువు పూర్తి చేసి వచ్చాక రాజకుమారుడు(1999)తో హీరో అయ్యాడు. తండ్రి బాటలోనే గౌతమ్ కూడా ఉన్నత విద్యావంతుడు అవుతున్నాడు. ఆ తర్వాత సినీరంగంలోను అతడు పెద్ద స్టార్ అని నిరూపించాల్సి ఉంటుంది. మరి బాలకుడు అయిన గౌతమ్ హీరో అవుతాడా? తన ఆలోచనలు ఎలా ఉన్నాయో? ఈ యువ కిశోరం భవిష్యత్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.