JAISW News Telugu

Mahesh Babu Daughter : సైబర్ క్రైమ్ కేసు లో చిక్కుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార!

FacebookXLinkedinWhatsapp
Mahesh Babu Daughter

Mahesh Babu Daughter Sitara

Mahesh Babu Daughter Sitara : ఈమధ్య కాలం లో సెలబ్రిటీస్ పేరు మీద ఫేక్ అకౌంట్స్ సోషల్ మీడియా లో వేల కొద్దీ పుట్టుకొస్తున్నాయి. ఆ ఫేక్ అకౌంట్స్ ద్వారా వచ్చే పోస్టులను నమ్మి కొంతమంది అమాయకపు జనం మోసపోతున్నారు. డబ్బులు, నగదు ఇచ్చి నష్టపోతున్నారు. రీసెంట్ గా మహేష్ బాబు కూతురు పేరిట ఇలాంటి మోసాలే ఎదురయ్యాయి. ఈమె పేరుతో ఒక ఫేక్ ప్రొఫైల్ ని క్రియేట్ చేసి ఇన్వెస్ట్మెంట్, బెట్టింగ్ లింక్స్ ని కొంతమంది ఆకతాయిలు చేస్తున్నారు.

దీనిని గమనించిన జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ టీం సితార పేరుతో ఉన్న ఆ ఫేక్ ప్రొఫైల్ లింక్స్ పై సైబర్ కేసు ని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేసారు. ఈ సందర్భంగా నమ్రత శిరోడ్కర్ కాసేపటి క్రితమే దీనిపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ నా కూతురు పేరిట కొంతమంది సైబర్ నేరగాళ్లు చేస్తున్న పనులను ఖండిస్తూ వాల్ల ఐపీ అడ్రస్ లను మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చెయ్యడం జరిగింది.

ఇంకా ఆమె మాట్లాడుతూ ముందు ముందు కూడా ఇలాంటి వాళ్ళు ఫేక్ అకౌంట్స్ తో వచ్చి మిమల్ని మోసం చెయ్యాలని చూస్తుంటారు, వాళ్ళు ఫాలో అయ్యే ముందు ఒకసారి అది నిజమైన అకౌంటా, కాదా అనేది రెండు మూడు సార్లు ద్రువీకరించుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది నమ్రత శిరోద్కర్. ఇన్నేళ్ళలో ఆమె ఒక అంశం పై ఇంత సీరియస్ గా మాట్లాడడం జరిగింది ఇదే మొదటిసారి. ఇకపోతే సితార ఘట్టమనేని ఇంస్టాగ్రామ్ లో పాపులర్ సెలబ్రిటీ అనే విషయం మన అందరికీ తెలిసిందే. కేవలం మహేష్ బాబు కూతురు అవ్వడం వల్ల ఆమెకి ఈ ఇమేజి రాలేదు.

తన టాలెంట్ తోనే ఈ ఇమేజ్ ని దక్కించుకుంది. సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉండే సాంగ్స్ కి డ్యాన్స్ చెయ్యడం ఈమెకి హాబీ. రీసెంట్ గానే ఆమె ‘గుంటూరు కారం’ చిత్రంలోని  ‘ధమ్ మసాలా బిర్యాని’ అనే పాటకి డ్యాన్స్ వేస్తూ ఒక రీల్ ని అప్లోడ్ చేసింది. ఈ రీల్ కి ఇంస్టాగ్రామ్ మొత్తం సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఒక్క రోజులోనే మిలియన్ల కొద్దీ లైక్స్, వ్యూస్ రావడం విశేషం. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ కి కూడా అంత లైక్స్, వ్యూస్ రావడం ని చాలా అరుదుగా మనం చూస్తుంటాము అలాంటిది సితార ఇంత చిన్న వయస్సు లోనే ఆ రేంజ్ కి చేరుకోవడం ప్రశంసనీయం.

Exit mobile version