Poacher : ‘పోచర్’ ఒక అద్భుతమైన సిరీస్.. మహేశ్ బాబు ఏమన్నారంటే?

Poacher

Poacher and Mahesh Babu

ఇటీవల అమేజాన్ ప్రైమ్ లో రిలీజైన క్రైం బేస్డ్ వెబ్ సిరీస్ ‘పోచర్’. ఈ సిరీస్ వాస్తవిక కథ ఆధారంగా చిత్రీకరించారు. కేరళ అడవుల్లో అందమైన జాతిగా గుర్తింపు తెచ్చుకున్న ఏనుగులను చంపి వాటి దంతాలను ఎక్స్ పోర్ట్ చేయడంపై కథ సాగుతుంది. వేలాది ఏనుగులు సైతం పదుల సంఖ్యలోకి తగ్గిపోతాయి. దీని వెనుక ఉన్న రాకెట్ ను పట్టుకునేందుకు పోలీసులు చేసే ప్రయత్నమే ‘పోచర్’.

నిమిషా సంజయన్ ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. ఫారెస్ట్ ఆఫీసర్ అయిన ఆమె ఏనుగుల వేట గ్యాంగ్ ను పట్టుకునేందుకు చేసిన సాహసాలు అద్భుతంగా చిత్రీకరించారు దర్శకుడు. రోషన్ మ్యాథ్యు, భట్టాచార్య తదితరులు సినిమాలో లీడ్ రోల్స్ పోషించారు. వేటగాళ్లను పట్టుకుని విలువైన ఏనుగు జాతిని కాపాడే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

ఈ సిరీస్ పై మహేశ్ బాబు స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ (ట్విటర్) లో ఒక పోస్ట్ షేర్ చేశాడు. అది ఇప్పుడు వైరల్ అయ్యింది. అతను రాసుకున్నాడు. ‘ఎవరైనా దీన్ని ఎలా చేయగలరు? వారికి మానవత్వం లేదా? వారి చేతులు వణకడం లేదా? ఈ క్రైమ్-థ్రిల్లర్ చూసిన చాలా కాలం తర్వాత నా తలలో ఇలాంటి ప్రశ్నలు తిరుగుతూనే ఉన్నాయి.’

మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ ‘పోచర్’పై ఇలా స్పందించడంతో సిరీస్ మరింత హైప్ ను సొంతం చేసుకుంది. ఈ బర్నింగ్ సమస్యపై చర్చలకు తెర లేపారు మహేశ్ బాబు. రీసెంట్ గా మహేశ్ నటించిన ‘గుంటూరు కారం’ తర్వాత ప్రస్తుతం బ్రేక్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన తర్వాతి ప్రాజెక్ట్ దర్శకధీరుడు రాజమౌళితో ఉండబోతోంది. దీని కోసం రెడీ అవుతున్నారు మహేశ్. త్వరలోనే ఈ హాలీవుడ్ తరహా భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది.

TAGS