Sunrisers Hyderabad : ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో రికార్డు నెలకొల్పింది. అత్యధిక స్కోర్ కొట్టినా.. అత్యంత వేగంగా ఛేజ్ చేసినా SRH కే చెల్లింది. లక్నో జట్టుపై జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు అత్యంత వేగంగా పరుగులు ఛేదన చేసి పది వికెట్ల విజయాన్ని నమోదు చేసింది. 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే సన్ రైజర్స్ జట్టు ఛేదించింది. తద్వారా వేగవంతమైన ఛేదన రికార్డును సొంతం చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు బ్యాటర్లు చాలా ఇబ్బంది పడుతూ ఆడారు. బంతి బౌన్స్ లేదంటూ కామెంటేటర్లు చెప్పారు. అయితే సన్ రైజర్ జట్టు ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మలు ఆ విశ్లేషణలకు పూర్తి భిన్నంగా ఆడారు. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 75 పరుగులు సాధించగా, హెడ్ 30 బంతుల్లో ఏకంగా 90 పరుగులు సాధించాడు.