Sunrisers Hyderabad : ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ దంచి కొడుతుంది. రోజురోజుకు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సీజన్లో 277 పరుగులు చేసి అత్యధిక స్కోరుని తన పేరిట నమోదు చేసుకుంది. ప్రస్తుతం ఆర్ సి బి తో జరిగిన మ్యాచ్లో 287 పరుగులు చేసి తన రికార్డును తానే బద్దలు కొట్టుకొని చరిత్ర సృష్టిం చింది. ఓకే ఐపీఎల్ సీజన్ లో ఎక్కువ పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఐపీఎల్ లో సన్ రైజర్స్ కు అత్యధిక స్కోర్లు ఇవే కావడం గమనార్హం. హైదరాబాద్ తరపున ఆస్ట్రేలియా బ్యాటర్ హెడ్, బౌలర్లపై సిక్సులతో విరుచుకుపడుతున్నాడు. బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తున్న బ్యాటింగ్లో మాత్రం దుమ్ము రే కొడుతున్నారు. దీంతో వీరిని ఎదుర్కోవాలంటే ప్రత్యర్థి బౌలర్లు భయపడేలా చేస్తున్నారు.
క్లాసిన్ ప్రతి మ్యాచ్లో సిక్సులు కొట్టకుండా ఉండలేకపోతున్నాడు కేవలం ఆరు మ్యాచ్లోనే 24 సిక్స్ లు కొట్టి తనంటే ఏంటో నిరూపించుకుంటున్నాడు. హెడ్ అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి క్లాస్ న్, అబ్దుల్ సమద్ లాంటి బ్యాటర్లు భీకరమైన ఫామ్ లో ఉండడంతో ప్రత్యర్థులు బెంబేలెత్తుతున్నారు.
దీంతో ఈ సీజన్లో సన్రైజర్స్ ఓనర్ కావ్య మారన్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని అభిమానులు మెచ్చుకుంటున్నారు. అసలు సన్ రైజర్స్ కు ఈ సీజన్లో ఎదురు ఉందా అని అనుకుంటున్నారు. ప్రత్యర్థిని మొదటి ఆరు ఓవర్లలోనే గుక్క తిప్పుకోనీయకుండా వీర బాదుడు బాదుతున్నారు . ఈ విధ్వంసం ముందు బౌలర్లు డీలా పడిపోతున్నారు. ఇంతలా సన్ రై జర్స్ మా రిపోవడానికి కారణం ఏమిటి అని చర్చించుకుంటున్నారు. ఈ హైదరాబాద్ టీం గత సీజన్లో చివరి స్థానంలో నిలిచి పరువు పోగొట్టుకుంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా టైటిల్ రేసులో ఉందని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఇదే ఊపు కనక మిగతా ఎనిమిది మ్యాచ్ల్లో కొనసాగిస్తే కచ్చితంగా ఎవరు అడ్డుకోలేరు.