Sunrisers Hyderabad : హైదరాబాద్ సన్ రైజర్స్ ఆడిన నాలుగింటిలో రెండు అద్భుత విజయాలు అందుకుంది. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని విజయాల బాట పట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించిన తీరు అందరిని ఆశ్చర్యపరచింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సీఎస్కేను మట్టి కరిపించింది. ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచింది. బలమైన సీఎస్ కే ను ఓడించడం ద్వారా సవాలు విసిరింది.
మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. శివం దుబే 24 బంతుల్ల నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లతో 45 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అజింక్య రహానే 35, రవీంద్ర జడేజా 31 పరుగులు చేసినా ఆ జట్టు ఓటమిపాలు కాక తప్పలేదు. సన్ రైజర్స్ ధాటికి తట్టుకోలేకపోయింది.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ను టార్గెట్ ఛేదించడానికి పెద్దగా ఇబ్బంది పడలేదు. 11 బంతులు మిగిలి ఉండగానే విజయం ముంగిట నిలిచింది. నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ విజయం అందుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని నాలుగుకు పెంచుకుంది. ఇలా సన్ రైజర్స్ విజయం సాధించడం గమనార్హం.
2023 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంత అధ్వానంగా ఆడిందో తెలిసిందే. 14 మ్యాచ్ ల్లో గెలిచింది నాలుగు మాత్రమే. పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచింది. ఈ సీజన్ లో సన్ రైజర్స్ సత్తా చాటుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం కొనసాగించింది. గత సీజన్ కు భిన్నంగా ఆడటంతో అందరు ముచ్చట పడుతున్నారు.
మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించడం మామూలు విషయం కాదు. ముంబై ఇండియన్స్ పై ఏకంగా 277 పరుగులతో రికార్డు నెలకొల్పింది. తరువాత చెన్నై సూపర్ కింగ్స్ వంటి బలమైన జట్టును 165 పరుగులకే కట్టడి చేసి సంచలనం కలిగించింది. ఇలా సన్ రైజర్స్ వరుస విజయాలు సాధించడం ఆశ్చర్యకరమే.