JAISW News Telugu

YS Sunitha : వివేకా హత్య కేసుపై సుప్రీంలో పిటీషన్.. దాఖలు చేసిన సునీత..

YS Sunitha

YS Sunitha

YS Sunitha : తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం జరిగే ప్రయత్నాన్ని సునీతా రెడ్డి వదలడం లేదు. ఈ కేసుకు సంబంధించి ఆమె మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నిందితుడైన శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

శివశంకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు (ఏప్రిల్ 08) ఈ పిటిషన్ ను విచారించనుంది.

ఐదేళ్లుగా సునీత న్యాయం కోసం పోరాడుతోంది. తన తండ్రి హంతకులను తన బంధువు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాపాడుతున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. తన తండ్రిని చంపిన హంతకులను పట్టుకొని తగిన శిక్ష వేయాలని కోరుతుంది. అప్పుడే న్యాయం, ధర్మంపై నమ్మకం ఉంటుందని పేర్కొంటుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన తరుణంలో సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించడం పెను దుమారమే రేపుతోంది.

సునీత తీరుపై పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికల లబ్ధికోసమా.. లేదంటే తండ్రిపై నిజంగా ఉన్న ప్రేమనా? అని ప్రశ్నించే వారు లేకపోలేదు. ఎవ్వరు ఏమన్నా పట్టించుకునే పరిస్థితిలో ప్రస్తుతం తాను లేనని సునీత చెప్పడం కొసమెరుపు. ఈ కేసు ఎటు నుంచి ఎటు మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టంగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వివేకా హత్య జరిగి ఇన్నాళ్లయినా ఇప్పటికీ కొలిక్కి రాకపోవడం.. సీబీఐ కూడా సీరియస్ గా తీసుకోకపోవడంతో నేరస్తులు బయటతిరుగుతున్నారని సునీత ఆరోపిస్తోంది.

Exit mobile version